Political News

రాజ్య‌స‌భ ఎఫెక్ట్‌: 4 మాసాల ముందే క‌ర్చీఫ్‌లు వేసేశారా.. ?

రాష్ట్రంలో ఈ ఏడాది నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మూడు వైసిపి అభ్యర్థులకు సంబంధించినవి ఉండడం విశేషం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉత్తరాది రాష్ట్రానికి చెందిన పరిమళ నత్వాని, అదేవిధంగా మంగళగిరి కి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈ ముగ్గురు వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపికయ్యారు. టీడీపీకి చెందిన సానా సతీష్ బాబు కూడా ఈ ఎడాది రిటైర్ కారున్నారు. మొత్తంగా ఈ నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

అయితే ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం, రాష్ట్రంలో ఉన్న అధికార కూటమిని గమనిస్తే ఈ నాలుగు స్థానాలు కూటమికే చెందుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దాదాపు పది మంది వరకు నాయకులు ఈ సీట్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. వీటిలో బిజెపి రెండు స్థానాల కోసం పట్టుబడుతోందని, జనసేన ఒక స్థానం కోసం ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. మిగిలిన వాటిలో టిడిపి నుంచి ఎక్కువమంది పోటీలో కనిపిస్తున్నారు.

వీరిలో సీనియర్ నాయకుల నుంచి గత ఎన్నికల్లో టికెట్లు ద‌క్క‌ని నేతల వరకు ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజెపితో కలిసి ఉన్న నేపథ్యంలో పరిమళనత్వానిని తిరిగి రాజ్యసభకు పంపించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా చూసుకుంటే 4 స్థానాల్లో కేవలం మూడు మాత్రమే కూటమికి దక్కుతాయి. ఈ మూడు స్థానాల్లో ఒకటి కచ్చితంగా జనసేన కోరుకుంటుంది కాబట్టి ఆ పార్టీకి ఇవ్వాలి. మిగిలిన రెండు స్థానాల్లో బిజెపి ఒకటి.. టిడిపి ఒకటి తీసుకుంటాయా లేకపోతే టిడిపినే రెండు తీసుకుంటుందా అనేది ఇంకా చర్చకు రాలేదు.

కానీ, మరోవైపు మాజీ మంత్రుల నుంచి సీనియర్ నేతల వరకు కూడా చాలామంది తమకంటే తమకే కావాలంటూ ఇప్పటినుంచి లాబీయింగ్ ప్రారంభించారని టిడిపి వర్గాల్లో చర్చ నడుస్తోంది. చివరికి ఇది ఏం జరుగుతుంది సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం టిడిపి వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిత్రం ఏంటంటే ఈ పరంపరలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు, పోలిట్‌ బ్యూరో సభ్యుడుగా ఉన్న వ్యక్తి కూడా పోటీ పడుతున్నారు.

అదేవిధంగా ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు లైన్ లో ఉన్నారు. అలాగే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు గతంలో అనేక పదవులు అనుభవించిన నేత కూడా రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతమంది పోటీపడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇవి దక్కుతాయి అనేది చూడాలి. ఇక ఈ ఏడాది జూన్ 21 వరకు ప్రస్తుతం ఉన్న సభ్యులు కొనసాగుతారు. జూన్ 22 నుంచి కొత్త సభ్యుల ఎన్నిక జరుగుతుంది.

This post was last modified on January 7, 2026 12:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారీగా త‌గ్గ‌నున్న కార్లు-దుస్తుల ధ‌ర‌లు

యూరోపియ‌న్ దేశాలుగా పేరొందిన జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రిట‌న్‌, స్విట్జ‌ర్లాండ్‌, నార్వే, స్పెయిన్‌, ఉక్రెయిన్‌, పోలాండ్ స‌హా 25 దేశాల…

1 hour ago

సంక్రాంతి హ్యాంగోవర్ నుంచి బయటికొస్తారా?

కొత్త ఏడాది ఆరంభమవుతుంటే.. తెలుగు ప్రేక్షకుల దృష్టంతా సంక్రాంతి మీదే ఉంటుంది. ఆ పండక్కి భారీ చిత్రాలు, ఎక్కువ సంఖ్యలో…

2 hours ago

మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా

తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్…

2 hours ago

నేను చిక్కిపోయింది అందుకేరా నాయనా: లోకేశ్

టీడీపీ కీలక నేత, మంత్రి లోకేశ్ గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా సన్నబడ్డారు. దీంతో, లోకేశ్ పక్కాగా డైట్ మెయింటైన్…

2 hours ago

గాంధీ టాక్స్… నిశ్శబ్దం చేయించే యుద్ధం

మాటలు లేకుండా సినిమాను ఊహించుకోవడం కష్టం. డైలాగులు పెట్టకుండా కేవలం సీన్స్ తో కన్విన్స్ చేయడం అసాధ్యం కాబట్టి దర్శక…

3 hours ago

‘గద్దర్ అన్నను గేటు బయట నిలబెట్టింది ఆయనే’

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ ఎస్ నేత జోగినిపల్లి సంతోష్ రావు ఈ రోజు సిట్…

5 hours ago