కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు, వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులు 13 శాతం మేర పూర్తికాగా, మొత్తం నిర్మాణం ఇప్పటివరకు 87.8 శాతానికి చేరుకుంది. 2014 నుంచి 2019 మధ్యకాలంలోనే సివిల్ పనులు 72 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు.
అయితే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాలనలో కనీసం 2 శాతం పనులు కూడా ముందుకు సాగలేదని వెల్లడించారు. ఈ లోటును పూరించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించనున్నారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్‌తో పాటు కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్–1, గ్యాప్–2 పనులను సీఎం ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
అదే విధంగా నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతినీ ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దనే సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, మిగిలిన పనులను వేగవంతం చేసే అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు.
This post was last modified on January 7, 2026 8:14 am
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఇటీవల రిలీజ్ చేసిన…
మూడేళ్లు వెనక్కి వెళ్తే.. తమిళ సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో మొదలైన ఓ సినిమాకు ముందు ఓకే చెప్పి, తర్వాత…
రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ…
కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనపుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ టీవీల్లో, ఓటీటీల్లో వాటికి మంచి స్పందన వస్తుంటుంది. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల రాజకీయాలు వద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రెండురాష్ట్రాలకూ నీటి సమస్యలు ఉన్నాయని..…
మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లలో చివరి ఘట్టం పూర్తయ్యింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్…