గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు సంబంధించిన తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. టీ పీసీసీ చీఫ్ గా ఎవరు ఎంపిక అవుతారు? యువనేత రేవంత్ రెడ్డినా? లేదంటే సీనియర్ గా పేరున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డినా?. ఈ విషయంపై నిజంగానే ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. పొమ్మనే దాకా కుర్చీని పట్టుకు వేలాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి… మొన్నటి గ్రేటర్ ఫలితాల దెబ్బకు పదవికి రాజీనామా చేయక తప్పలేదు. దీంతో ఇప్పటికిప్పుడు టీపీసీసీకి కొత్త సారథి కావాల్సిందే.
అదే పని ప్రస్తుతం చాలా పకడ్బందీగానే సాగుతోంది. తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ హోదాలో ఆ పార్టీ సీనియర్ నేత మాణిక్యం ఠాకూర్ హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా టీ పీసీసీ చీఫ్ ను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అందుబాటులో ఉన్న అందరు నేతలతో విడివిడిగా భేటీలు వేస్తున్నఠాకూర్ శనివారం నాటికి తన పనిని ముగించినట్టుగా ప్రకటించేశారు. అయితే టీపీసీసీ నూతన సారథి ఎవరన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంస్కృతి అదే కదా. ఏదీ ఓ పట్టాన తేల్చరు. క్షేత్రస్థాయిలో తేల్చిన విషయాలను అధిష్ఠానం పెద్దలు ప్రకటిస్తారు.
సరే మరి.. టీపీసీసీ చీఫ్ ఎవరన్న విషయాన్ని ఠాకూర్ తేల్చారు కదా. ఆ నేత ఎవరై ఉంటారన్న విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విశ్లేషణలు మొదలైపోయాయఆ. కొందరేమో యువ నేత రేవంత్ రెడ్డి అంటుంటే… మరికొందరేమో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు చెబుతున్నారు. ఇంకొందరు ఏకంగా సీనియర్ మోస్ట్ నేత వి. హన్మంతరావు పేరును కూడా చెప్పేస్తున్నారు. ఇక జగ్గారెడ్డి లాంటి వారు తమ పేర్లను తామే చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అన్నీవింటున్న ఠాకూర్ మాత్రం తన పనిని తాను చాలా పకడ్బందీగానే పూర్తి చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త సారథి ఎవరు? ఆ సారథికి ఏ తరహా సత్తా ఉండాలి? అసలు కొత్త సారథిగా ఎవరైతే బాగుంటుంది? ఫలానా నేతను సారథిగా చేస్తే పార్టీకి ఒనగూరే లాభమెంత? లాభం కంటే నష్టం ఏమైనా ఉంటుందా? అసలు సదరు నేతను కొత్త సారథిగా ఎంపిక చేస్తే పార్టీకి లాభమా? నష్టమా? అందరినీ కలుపుకుని పోయే సత్తా సదరు నేతలో ఉందా? ఆ నేతను ఎంపిక చేస్తే ఏమైనా అసమ్మతి రేకెత్తుతుందా? ఆ తరహా ప్రమాదం ఏఏ నేతల నుంచి వస్తుంది?… ఇలా అన్ని విషయాలపై ఠాకూర్ చాలా కూలంకషంగానే పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ వివరాలతో తాను రూపొందించిన నివేదికను ఆయన పార్టీ అధిష్ఠానానికి అందజేయనున్నారు. ఆ నివేదికలోని పేరును అధిష్ఠానం.. అంటే సోనియా ప్రకటిస్తుందన్న మాట.
ఓ వైపు టీపీసీసీ చీఫ్ ను తేల్చే పనిలో ఠాకూర్ నిమగ్నమైపోయి ఉండగా… ఆ పదవిని దక్కించుకునేందుకు పలువురు కీలక నేతలు తమదైన శైలి యత్నాలను చేశారు. టీపీసీసీ చీఫ్ పదవి కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి… ఈ సారి ఎలాగైనా తన కల నెరవేర్చుకోవాల్సిందేనన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. అంగ, అర్థ బలం పుష్టిగానే ఉన్న కోమటిరెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే బాగానే ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న యువనేత రేవంత్ రెడ్డి అయితే మరింత బాగుంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
పార్టీలో ఈ ఇద్దరి నాయకత్వాల పట్ల మొత్తంగానే నేతలంతా రెండు వర్గాలుగా చీలిపోయిన వైనం కూడా చాలా స్పష్టంగానే తెలుస్తోంది. ఇక పార్టీలో ఏ పదవి అయినా తమకే దక్కాలన్న రీతిలో వ్యవహరిస్తున్న వీహెచ్, జగ్గారెడ్డి లాంటి కొందరు ఆటలో అరటి పండు మాదిరిగా మీడియా ముందుకు వచ్చి తమకేం తక్కువ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నార. మొత్తంగా టీపీసీసీ చీఫ్ ఎవరన్న విషయాన్ని ఇప్పటికే ఠాకూర్ తేల్చేయగా… ఆ నేత ఎవరన్న మాటను సోనియా గాంధీ ప్రకటించనున్నారు.
This post was last modified on December 13, 2020 8:41 am
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…