ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులే. వ్యంగ్యమైన కార్టూన్లతో రాజకీయ నాయకులపై శ్రీధర్ వేసే సెటైర్లు ఎంతో పాపులర్. నాలుగు దశాబ్దాలపాటు ప్రింట్ మీడియా కార్టూనిస్ట్ లలో మకుటం లేని మహరాజులాగా ఓ వెలుగు వెలిగారు శ్రీధర్. అన్న ఎన్టీఆర్ మొదలు జగన్ వరకు…అంజయ్య నుంచి చంద్రబాబు వరకు…ఇందిరమ్మ నుంచి మోదీ వరకు…ఎంతోమంది రాజకీయ నాయకులపై తన మార్క్ కార్టూన్లు వేసిన ఘనత శ్రీధర్ కే దక్కింది. 42 ఏళ్లపాటు ఈనాడులో కార్టూనిస్ట్ గా సేవలందించిన శ్రీధర్ ప్రస్తుతం కార్టూనిస్ట్ గా రిటైర్ అయ్యారు. అయితేనేం, ఆయన అనుభవాన్ని ఈ తరానికి కూడా అందించాలన్న సదుద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ఆయనను సలహాదారుగా నియమించింది.
ఏపీ ప్రభుత్వ మాస్ కమ్యూనికేషన్ సలహాదారుడిగా శ్రీధర్ ను రెండేళ్లపాటు నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార ప్రచార విభాగానికి సంబంధించిన కీలక బాధ్యతలను ఆయన చూసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 1982లో టీడీపీ ఆవిర్భావం, ఆగస్టు సంక్షోభం వంటి కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీధర్ వేసిన కార్టూన్లు బాగా పేలాయి. కేవలం రాజకీయాలే కాదు సమకాలీన, సామాజిక, సందేశాత్మక, మానవతా కోణం ఉన్న కార్టూన్లు వేసిన శ్రీధర్ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. దివంగత రామోజీ రావు మానన పుత్రిక అయిన ఈనాడు పత్రికలో తనకంటూ ఓ పేజీ రాసుకున్న శ్రీధర్ అంటే రామోజీరావుకు ఎనలేని అభిమానం.
అటువంటి శ్రీధర్ ను ఏపీ ప్రభుత్వం మాస్ కమ్యూనికేషన్ సలహాదారుడి నియమించడం సముచితమే. ఆ పదవికి ఆయన అన్ని విధాలా అర్హుడే. అయితే, ఈ సోషల్, డిజిటల్ మీడియా యుగంలో శ్రీధర్ వంటి వెటరన్ కార్టూనిస్ట్ ను ఆ పదవిలో ఏపీ ప్రభుత్వం నియమించడం, ఆ హోదా ఇవ్వడం అంత చిన్న విషయమేమీ కాదు. కానీ, శ్రీధర్ కు ఉన్న అపార అనుభవంతో ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
This post was last modified on December 30, 2025 2:38 pm
ఏపీ రాజధాని అమరావతికి 2025 ఓ మహత్తర సంవత్సరమేనని చెప్పాలి. 2014-19 మధ్య ఏపీ రాజధానిగా ఏర్పడిన అమరావతి.. తర్వాత…
దర్శకుడు అనిల్ రావిపూడి లుక్స్, చలాకీతనం హీరోగా చేయడానికి పనికొచ్చేలా ఉంటాయి. పైగా డాన్స్ కూడా బాగా వచ్చు. రియాలిటీ…
చాలా ఏళ్ల నుంచి గీతా ఆర్ట్స్ సంస్థలో అంతర్భాగంగా ఉంటూ.. ‘జీఏ2’ బేనర్ మీద సినిమాలు నిర్మిస్తున్న బన్నీ వాసు.. ఈ…
సంక్రాంతి పండుగ…తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలు తమ కుటుంబ…
నలభై సంవత్సరాలుగా కుదరని కాంబినేషన్ దర్శకుడు అనిల్ రావిపూడి సాధ్యం చేశారు. మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవి, వెంకటేష్ ని…
మోహన్ లాల్ తల్లి శాంతకుమారి అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆమె వయసు 90 ఏళ్లు. శాంతకుమారి కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో…