బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి విద్యుత్ బిల్లుల అంశంపై ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది భక్తులు సందర్శించుకునే ఈ ఆలయానికి బిల్లులు బకాయిలు ఉన్నాయనే కారణంతో గంటసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం.. ఆ వెంటనే పునరుద్ధరించటం జరిగిపోయాయి.
దీనికి సంబంధించి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా దుర్గ గుడి యాజమాన్యం అప్పారావుపేటలోని, పాముల కాలువ వద్ద గల తమ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 24 మెగావాట్ విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. ఇందుకు ప్రతిగా విద్యుత్ శాఖ వారు దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ఆ సర్వీసులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరిగాయి. చర్చల అనంతరం విద్యుత్ ను పునరుద్ధరించారు.
అంతకుముందు ఏం జరిగిందంటే గడువు ముగిసినా దుర్గగుడి అధికారులు దాదాపు 3.20 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేదని విద్యుత్ శాఖ చెబుతోంది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని స్పష్టం చేసింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.
ఒకసారిగా విద్యుత్తు ఆగిపోవడంతో, అధికారులు వెంటనే జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. కొద్దిసేపు లిఫ్టులు, ఏసీలు పనిచేయకపోవడంతో భక్తులు కొంత అసౌకర్యానికి పోయారు. అధికారులు విద్యుత్ శాఖ ఉన్నతాధికారితో చర్చలు జరిపి విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా చేశారు.
This post was last modified on December 27, 2025 6:55 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…