Political News

బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిన మోడీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అంటేనే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి త‌ర‌చుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు.. గీతా జ‌యంతినాడు ఆయ‌న ఏకంగా భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణ కూడా చేస్తారు. ఇటీవ‌ల క‌ర్ణాటక‌లోని శ్రీకృష్ణ మ‌ఠానికి వెళ్లిన‌ప్పుడు కూడా భ‌గ‌వ‌ద్గీత ల‌క్ష గ‌ళ పారాయ‌ణ‌లోనూ పాల్గొన్నారు. అయోధ్య‌లో 5 దశాబ్దాల నాటి క‌ల‌ను నిజం చేస్తూ.. రామమందిరాన్ని సాకారం చేశారు. ఇక‌, ఎక్క‌డ ఏ అవ‌కాశం చిక్కినా.. ఆయ‌న రాముడు, కృష్ణుడు.. హిందూ ప‌రివార దేవ‌త‌ల గురించే చెబుతారు.

అన్య‌మ‌తాలు.. ఇత‌ర మ‌త‌గ్రంథాల గురించి ఎప్ప‌డూ.. ప్ర‌ధాని మోడీ మాట్లాడింది లేదు. అలాంటి ప్ర‌ధాని.. తాజాగా క్రిస్మ‌స్‌ను పుర‌స్క‌రించుకుని చ‌ర్చికి వెళ్తార‌ని ఎవ‌రైనా ఊహిస్తారా? ఒక‌వేళ వెళ్లినా.. ఆయ‌న బైబిల్‌ను ప‌ట్టుకుని.. వాక్యం చ‌దువుతార‌ని అనుకుంటారా? పోనీ.. ఇది కూడా చేశార‌ని అనుకున్నా.. క్రైస్త‌వ ప్రార్థ‌న‌లు, గీతాలాప‌న‌లో పాల్గొని.. తాళం వేస్తారా? అంటే.. ఇలా ఊహించ‌నివి ఎన్నో ప్ర‌ధాని మోడీ తాజాగా చేసి చూపించారు. ప్ర‌స్తుతం మోడీ చ‌ర్చికి వెళ్ల‌డం, బైబిల్ చేత ప‌ట్టుకుని వాక్యం చ‌ద‌వ‌డం.. గీతాల‌కు తాళం వేయ‌డం వంటివి చూసి.. నెటిజ‌న్లే కాదు.. బీజేపీ నేత‌లు కూడా ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

ఏం జ‌రిగిందంటే..

క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని కెథెడ్ర‌ల్ చ‌ర్చ్‌కు వెళ్లిన ప్ర‌ధానికి చ‌ర్చి నిర్వాహ‌కులు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం.. నిర్వ‌హించిన ప్ర‌త్యేక గీతాల‌పానలో ప్ర‌ధాని పాల్గొన్నారు. అదేవిధంగా చ‌ర్చి మ‌తాచార్యులు.. బైబిల్‌లోని వాక్యాల‌ను చ‌దివి.. ప్రార్థ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌ధాని పాల్గొన్నారు. కాగా.. క్రిస్మ‌స్ ప‌ర్వదినం.. ద‌య‌, ప్రేమ ప‌ట్ల నిబ‌ద్ధ‌త‌ను చాటు తుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఎందుకు?

అయితే.. ఉన్న‌ప‌ళాన ఈ ఏడాది ప్ర‌ధాని చ‌ర్చికి వెళ్ల‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. ప్ర‌స్తుతం దేశంలోని క్రైస్త‌వుల గురించి కాక‌పోయినా.. ప్ర‌పంచ వ్యాప్తంగా మెజారిటీ క్రిస్టియానిటీని పాటిస్తున్న బ్రిట‌న్‌, ర‌ష్యా, ద‌క్షిణ కొరియా వంటి అతి పెద్ద‌ దేశాల‌తో ప్ర‌ధాని మిత్ర‌త్వం కోరుకుంటున్నారు. అదేస‌మ‌యంలో అమెరికాతో మాత్రం అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా దేశాలను మ‌రింత మ‌చ్చిక చేసుకునే వ్యూహాత్మ‌క ఆలోచ‌న‌తోనే ప్ర‌ధాని చ‌ర్చిల బాట ప‌ట్టార‌న్న వాద‌న వినిపిస్తోంది. 

This post was last modified on December 25, 2025 4:31 pm

Share
Show comments
Published by
Kumar
Tags: FeatureModi

Recent Posts

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

30 minutes ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

1 hour ago

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…

2 hours ago

లడ్డూ అంశంపై అసెంబ్లీలో పవన్ చర్చ?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…

2 hours ago

జక్కన్నా… నువు అసాధ్యుడివయ్యా!

ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్‌డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్‌డేట్‌…

2 hours ago

‘బుడగ పేలుతుంది… బంగారం కొనొద్దు’

సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…

3 hours ago