Political News

పవన్ సీఎం కావాలనేదే వైసీపీ కోరికా?

ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉందని మూడు పార్టీల నేతల అభిప్రాయం. ఒక కట్టుబాటుగా మిగతా పార్టీల నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంకటంగా మారింది. ఏ సందర్భం వచ్చినా కూటమిలో చిచ్చు పెట్టేందుకు, భేదాభిప్రాయాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుందని కూటమి నేతల ఆరోపణ.

వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసేకొద్ది పవన్, లోకేష్ మరియు చంద్రబాబు వ్యక్తిగత, పార్టీ పరమైన స్వార్ధాలు చూసుకోకుండా కూటమి దృఢత్వానికి కృషి చేస్తున్నారు.

మరో 15 ఏళ్ల పాటు కూటమి ఇలాగే బలంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెబుతున్నారు. అయితే ఈ మాటలకు వైసీపీ వక్ర భాష్యం చెబుతూ, మళ్లీ మళ్లీ అరిగిపోయిన సీడీనే తిప్పుతున్నారు. ఈరోజు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అటువంటి వ్యాఖ్యలే చేశారు. ‘మరో 15 ఏళ్లు చంద్రబాబు సీఎం గా ఉంటారని పవన్ అంటున్నారు, అంటే పవన్ కళ్యాణ్ కు 70 వచ్చేవరకు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేదా..?’ అంటూ ఆయన ప్రశ్నించారు.

వైసీపీకి అర్థం కాని విషయం, చంద్రబాబు ముఖ్యమంత్రే అయినా, ఒక ఉపముఖ్యమంత్రిగా పవన్ స్థానాన్ని అనేక సందర్భాల్లో తనతో పాటుగానే ఉంచుతున్నారు తప్ప, తన కంటే కింద స్థానం అనే భావన ఎప్పటికీ తీసుకురావట్లేదు. లోకేష్ ఐతే అన్న అనే పిలుస్తున్నారు.

కూటమిలో నిప్పు రాజేసేందుకు ఎన్నికల ముందు నుంచి కూడా వైసీపీ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ప్రయత్నాలను చంద్రబాబు, పవన్, లోకేష్ సమర్థంగా తిప్పి కొడుతున్నారు. ఇరు పార్టీల శ్రేణులకు కూటమి బలంగా ఉండాల్సిన ఆవశ్యకతను ప్రతిసారి వివరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ స్థాయి ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు పాలనా దక్షతను క్యాబినెట్ సమావేశంలో ప్రస్తుతిస్తున్నారు. ఆయన సూచనలు తీసుకుంటున్నారు. వైసీపీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఇరు పార్టీల నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఐతే వైసీపీ మాత్రం పదే పదే అదే పాట పాడుతుండడంతో, పవన్ సీఎం కావాలని వైసీపీకి అంత కోరికగా ఉందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on December 21, 2025 9:19 am

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

4 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago