Political News

కూట‌మిలో క‌లివిడి.. గ్రౌండ్ రియాల్టీ ఇదే.. !

నిన్న మొన్నటి వరకు కూటమి పార్టీల మధ్య ఐక్యత ఎలా ఉన్నప్పటికీ ఇటీవల గత వారం నుంచి పార్టీల‌లో నాయ‌కుల మ‌ధ్య కలివిడి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ఎంపీలకు సంబంధించి చేసిన కీలక సూచనల అనంతరం ఈ కలివిడి గ్రౌండ్ లెవెల్లో మరింత ఎక్కువగా కనిపి స్తోంది అన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుపరిపాలన పైరుతో మాజీ ప్ర‌ధాన మంత్రి వాజ్ పేయి శతజయంతి ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బిజెపి ర్యాలీలు నిర్వహిస్తోంది. వాజ్ పేయికి సంబంధించిన పరిపాలనను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఏపీలో కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కలిసి పాల్గొంటున్నారు. చంద్రబాబు సైతం టిడిపి శ్రేణులకు ఇదే విషయం చెప్పారు. కలివిడిగా ఉండాలని, వచ్చే ఎన్నికల నాటికి కూడా కూటమి కొనసాగుతుందని, ఇప్పటి నుంచి నాయకులు అలెర్ట్ అవ్వాలని చెప్పడంతో క్షేత్రస్థాయిలో బిజెపి నాయకులతో కలిసి సుపరిపాలన యాత్రలు చేస్తున్నారు.

వాజ్ పేయి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో టిడిపి నాయకులు పాల్గొంటున్నారు. మంత్రుల నుంచి నాయకుల దాకా ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు అందరూ చేయి చేయి కలిపి కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. ఇదే కలివిడి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కాదు రాబోయే మరో రెండు మూడు ఎన్నికల వరకు కూడా ప్రభుత్వం బలంగానే ఉంటుందన్నది చంద్రబాబు ఆలోచన. మొత్తానికి ఇప్పటికైతే గ్రౌండ్ లెవెల్లో మూడు పార్టీల నాయకులు కలిసి పనిచేస్తున్నది వాస్తవం.

నిజానికి క‌లివిడి విష‌యంపై చంద్ర‌బాబు.. ఆది నుంచి కూడా నాయ‌కుల‌కు చెబుతున్నారు. అంద‌రూ క‌లిసిఉండాల‌ని కోరుతున్నారు. కానీ, ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఈ క‌లివిడి త‌గ్గింది. అయితే.. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ కూడా కూట‌మి బ‌లోపేతంపై చ‌ర్చించ‌డం.. వైసీపీని టార్గెట్ చేయాల‌ని చెప్ప‌డం.. క‌లివిడిగా ముందుకు సాగాల‌ని అన‌డంతో నాయ‌కుల్లో మార్పులు క‌నిపిస్తున్నాయి. ఇది.. ప్ర‌స్తుతం గ్రౌండ్‌లో క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ క‌లివిడి మ‌రింత బ‌లోపేతం అయితే.. బెట‌ర్ అన్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on December 20, 2025 6:44 pm

Share

Recent Posts

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

8 minutes ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

8 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

10 hours ago