అవకాశాలు చెప్పి రావు. అలాంటిది ఎంతో ముందుగా చెప్పి వస్తున్న వేళ.. ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన వేళ.. అందుకు భిన్నంగా ఉండిపోవటం చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ఆయన కుమారుడు కేటీఆర్ కు ఏమైందన్న సందేహం కలుగక మానదు. దేశంలోని ఒక మహా నగరానికి 64 దేశాలకు చెందిన రాయబారులు.. హైకమిషనర్లు రావటం అంటే మాటలా? అలాంటి అరుదైన అవకాశం వచ్చినప్పుడు నగర ఇమేజ్ భారీగా పెరిగేలా ప్రచారం చేసుకోవటం.. అందులో తనకు రావాల్సిన ఇమేజ్ వాటాను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. అలాంటిదేమీ చేయకుండా ఉండిపోయిన తీరు చూస్తే.. పెద్దసారుకు ఏమైందన్న సందేహం కలుగక మానదు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ముందంజలో ఉన్న హైదరాబాదీ కంపెనీ భారత్ బయోటెక్ సంస్థతో పాటు.. విదేశీ సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న బయోలాజికల్ -ఈ సంస్థల్ని 64 దేశాల విదేశీ రాయబారుల టీం తాజాగా నగరానికి రావటం తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఈ రెండు కంపెనీలను సందర్శించారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వాగతం పలకటం గమనార్హం.
ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర గొప్పతనం గురించి.. ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలైన గూగుల్.. యాపిల్.. ఫేస్ బుక్.. అమెజాన్.. మైక్రోసాఫ్ట్ కంపెనీలు తమ శాఖల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. ఫార్మా సెక్టార్ ను డెవలప్ చేస్తున్నామని.. నగరంలో 50 బిలియన్ డాలర్ల ఫార్మారంగం అభివృద్ది జరుగుతోందని సోమేశ్ వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ నగరంలోనే జరుగుతుందని.. పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి సోమేశ్ వివరించారు.
ఈ సందర్భంగా 64 దేశాల రాయబారులు ఈ రెండు కంపెనీల్ని సందర్శించారు. వ్యాక్సిన్ వివరాల్ని సేకరించారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇంత మంది విదేశీ రాయబారులు వచ్చిన వేళ.. కేవలం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ మాత్రమే వారిని కలవటం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అవకాశం రాకపోవటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రం ఈ తరహా ప్లానింగ్ చేసిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. మంత్రి కేటీఆర్ ఇమేజ్ పెరగకుండా మోడీషాలు ప్లాన్ చేసి ఉంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ.. అదే నిజమైతే.. ఇంత భారీగా వస్తున్న విదేశీ రాయబారుల వివరాల్ని అన్ని పేపర్లకు భారీ ఎత్తున ప్రకటనలతో పాటు.. హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగేలా.. రాయబారులకు.. విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికితే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. మరింత అరుదైన అవకాశాన్ని కేంద్రంతో కోట్లాడి అయిన సొంతం చేసుకోవాలే కానీ.. సీఎస్ చేతికి ఇచ్చి విడిచిపెట్టటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. హైదరాబాద్ మహానగరానికి ఇంతకు మించిన బంగారం లాంటి అవకాశం మళ్లీ దొరుకుతుందా? అన్నది అసలు ప్రశ్న.
This post was last modified on December 10, 2020 11:01 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…