బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక పత్రాలు అందుకుంటున్న ఓ మహిళా ఆయుష్ డాక్టర్ హిజాబ్‌ను సీఎం స్వయంగా తొలగించిన ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆ మహిళ క్షణకాలం నిశ్చేష్టురాలై నిల్చున్నట్లు కనిపించింది. వేదికపై ఉన్న కొందరు నవ్వడం కూడా విమర్శలకు కారణమైంది.
ఈ ఘటనపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ నితీశ్ కుమార్ మానసిక స్థితి సరిగా లేదేమో అంటూ విమర్శలు గుప్పించగా, కాంగ్రెస్ ఈ చర్యను అసహ్యకరమైనదిగా పేర్కొని సీఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో మహిళల భద్రతపై ఈ ఘటన తీవ్ర సందేహాలు కలిగిస్తోందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,283 మంది ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలు అందజేశారు. వీరిలో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ వైద్యులు ఉన్నారు. వీరిని ఆయుష్ మెడికల్ సర్వీసులు, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో వివిధ ఆరోగ్య సంస్థల్లో నియమించనున్నారు. ఈ ఘటన బిహార్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
This post was last modified on December 15, 2025 10:27 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…