బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పార్టీలు ఏవైనా.. నాయకులు ఎవరైనా ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీలో ఈ సంస్కృతి పెరుగుతోంది. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. ఇదే సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు.
టీడీపీని తీసుకుంటే.. ప్రతి జిల్లాలోనూ ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారు. కొందరు డైరెక్ట్‌గా మరికొందరు ఇన్‌డైరెక్ట్‌గా పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో పార్టీ, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. అయినా.. ఇది చాలదంటూ చంద్రబాబు చెబుతున్నారు. కానీ,అదేసమయంలో ఈ ట్రెండ్ కు భిన్నంగా వైసీపీ అడుగులు వేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. నాయకులు నోరు విప్పితే.. జగన్‌ను ప్రశంసించాలి. గత పాలనను భుజాలపై ఎత్తుకోవాలి.
ప్రజలకు ఎబ్బెట్టే అయినా.. జగన్‌ను ప్రశంసలతో పొగడాలి. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలంటే.. కొంత వెనుకంజ వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది అంతిమంగా తటస్థ నాయకులకు ఇబ్బందిగా మారిందన్నది తెలుస్తోంది. వైసీపీలో చాలా మంది నేతలు.. కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. వీరిలో గత తరం నాయకులు తటస్థంగా ఉంటారు. చేసే విమర్శల్లో పదును, సంచలనం కన్నా.. కూడా.. నిజాలు చూసుకుంటారు. వారి ఇమేజ్ దెబ్బతినకుండా కూడా చూసుకుంటున్నారు.
కానీ.. ఇది వైసీపీ అధిష్టానానికి నచ్చడం లేదు. దీంతో ఇలాంటి వారిని మీడియా ముందుకు రావద్దని గతంలోనే ఆదేశించారు. ఫలితంగా చాలా మంది నాయకులు దూరంగా ఉంటున్నారు. మరోవైపు.. సంచలన వివాదాస్పద కామెంట్లతో చెలరేగే నాయకులకు పట్టం కట్టారు. ఫలితంగా పార్టీ ఇమేజ్ పూర్తిగా నష్టపోయింది. వైసీపీ అంటే.. బూతుల పార్టీగా పేరు పడిపోయింది. ఈ ఇమేజ్‌నుంచి బయటకు వస్తే తప్ప.. ప్రస్తుతం మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే అవకాశం లేదు. ఈ దిశగా పార్టీ ఇప్పుడు ఆలోచన చేస్తోంది. మరి ఏమేరకు పుంజుకుంటారో చూడాలి.
This post was last modified on December 15, 2025 3:08 pm
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…