Political News

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని వారు ప‌ట్టించుకోవ‌డం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాష్ట్రంలో సీఎంగా ఆయ‌న ఒక‌వైపు అభివృద్ధి ప‌నులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాను ప‌రిగెడుతున్న వేగంతో స‌మానంగా ప‌రుగులు పెట్టాల‌ని ఆయ‌న ఎమ్మెల్యేల‌కు చెబుతున్నారు. అయితే.. వారు ఈ విష‌యాన్ని లైట్ తీసుకుంటున్నారు.

చంద్ర‌బాబు వేగం కాక‌పోయినా.. అంతో ఇంతో అయినా వేగంగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ.. కొంద‌రు మాత్రమే ప‌నులు చేప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. మిగిలిన వారు మాత్రం ఎక్క‌డిగొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో ఇలాంటి వారిపై చంద్ర‌బాబు రెండో కోణంలో ఆలోచించి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, పార్టీలో క‌ల‌హాలు పెట్టుకునే నాయ‌కులు కూడా పెరుగుతున్నారు.

వారిని కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రిస్తున్నారు. క‌ల‌హాల‌తో ఎన్నాళ్లు ఉంటారు..?  పార్టీ కార్య‌క్ర‌మాల కోసం ప‌నిచేయాల‌ని చెబుతున్నారు. కానీ.. నాయ‌కులు మాత్రం కొంద‌రు మార‌డం లేదు. ఇలాంటి వారిలో ఒక‌రిద్ద‌రికి ఇటీవ‌ల చంద్ర‌బాబు స్వ‌యంగా క్లాస్ ఇచ్చారు. అయిన కూడా.. వారిలో మార్పు క‌నిపించ‌డం లేదు. అయితే.. చంద్ర‌బాబు క‌ఠినం క‌ఠినం అంటున్నా.. పెద్ద‌గా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో ఇలాంటి నాయకులు లైట్ తీసుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే నాయ‌కులలో మార్పు అయితే పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. తాజాగా ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు వివాదం ఈకోవ‌లోదే. సో.. ఇలాంటి వారు ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబులోని ఒక‌కోణాన్ని మాత్రమే చూశార‌ని అంటున్నారు. ఆయ‌నే క‌నుక రెండో కోణం నుంచి ఆలోచిస్తే.. ఇప్ప‌టికిప్పుడు బాగానే ఉన్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి అడ్ర‌స్ గ‌ల్లంత‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు. సో.. తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్నవారు.. ఎంత‌టివారైనా.. పార్టీలైన్‌ను గౌర‌వించాల్సిందేన‌న్న‌ది గుర్తుంచుకోవాలి. 

This post was last modified on December 13, 2025 7:47 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

8 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago