వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కున్నారు. మరికొందరు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారు. దీంతో నాయకులు కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై తరచుగా వైసీపీలో చర్చ జరుగుతుంది. జగన్ పట్టించుకోవడంలేదని, కనీసం తమకు న్యాయ సహాయం కూడా అందించడం లేదని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి వైసీపీ తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోల సుధాకర్ రెడ్డి పలు కేసులను వాదిస్తున్నారు. అయినప్పటికీ కీలక నేతల విషయంలో పార్టీ శ్రద్ధ తీసుకుంటుందని, మిగిలిన వారి విషయంలో వదిలేస్తోందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఏం మాట్లాడితే ఎలాంటి కేసులు నమోదు చేస్తారో అనే ఆవేదనలో పార్టీ నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు జగన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రజల మధ్యకు రావాలని, తద్వారా ప్రభుత్వం కేసుల విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కానీ జగన్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రజల మధ్యకు వచ్చే విషయంలో అనేక సందర్భాల్లో సమయం పెట్టారు. కానీ ఒక్కసారి కూడా ఆయన స్పందించలేదు. మరోవైపు నాయకుల పై కేసులు నమోదు అవుతున్నాయి. వారు కేసుల్లో చిక్కుకుని జైళ్లకు కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేయాలని, అప్పటివరకు ఓర్చుకోవాలని జగన్ తరచుగా చెప్తున్నారు. తాజాగా మరోసారి పార్టీ నాయకులకు ఆయన ఇదే విషయాన్ని చెప్పారు.
వచ్చే ఎన్నికల వరకు ఓర్చుకోవాలని, మహా అయితే కేసులు పెడతారు, తప్ప అంతకుమించి ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. మనం అధికారంలోకి వచ్చాక వాటిని ఎత్తేస్తామనీ కూడా భరోసా ఇస్తున్నారు. కానీ పార్టీ నాయకులు మాత్రం ఇదే పద్ధతి కొనసాగితే తాము బయటకు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో మొత్తంగా వైసీపీలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వరకు వేచి చూసి అప్పటి వరకు బయటకు రాకుండా ఉంటే పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది కొందరు నాయకులు చెబుతున్న వాదన.
ఏదేమైనా జగన్ మాత్రం వచ్చే ఎన్నికల వరకు పార్టీ నాయకులు ఓర్చుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. మరి దీనిపై నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ప్రస్తుతం అయితే వైసీపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అన్నది వాస్తవం. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరాంధ్ర మినహా మిగిలిన చోట్ల నాయకులు కేసుల్లో ఇరుక్కున్న మాట వాస్తవం. నకిలీ మద్యం కేసు కావచ్చు, అక్రమ మద్యం కేసు కావచ్చు, ఎన్నికల సమయంలో నిధుల పంపిణీకి సంబంధించిన కేసులు కావచ్చు, సోషల్ మీడియా కేసులు కూడా చాలానే ఉన్నాయి. ఇలా మొత్తంగా వైసీపీ నాయకులు కేసుల్లో చిక్కుకుని అటు కోర్టుల చుట్టూ ఇటు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
This post was last modified on December 11, 2025 11:32 am
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
``సనాతన ధర్మ బోర్డును సాధ్యమైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.`` తాజాగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి…
గత వారం చివరి నిమిషంలో విడుదల వాయిదా పడిన అఖండ 2 ఇప్పుడు డిసెంబర్ 12 రావడం అంతా మంచికే…
భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని…
ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం…
రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం…