రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు, వైసీపీ నేతలు యాగీ చేసినప్పుడు కూడా ఆయన సైలెంట్‌గానే ఉన్నారు. కానీ.. తాజాగా మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌పైనే నేరుగా విరుచుకుపడ్డారు. తనపై జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. వైసీపీ సీనియర్ నేత.. వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సొమ్ములు ఇచ్చిన విషయంపై ఆయన రగిలిపోతున్నారు.
అయితే.. ఇది కేవలం అప్పన్న వ్యవహారంతోనే పోయేలా కనిపించడం లేదు. వేమిరెడ్డి నెల్లూరు జిల్లాలోని కీలక నాయకులకు ఒక ఆర్థిక వనరుగా ఉపయోగపడుతున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన అనేక మంది నాయకులకు సాయం చేశారు. ఎన్నిక లసమయంలో వారు తిరిగి ఇస్తారా? ఇవ్వరా? అని కూడా చూడకుండా.. ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని అప్పటి వైసీపీ నాయకులు చాలా మంది చెప్పారు. వేమిరెడ్డి సొమ్ము, సాయం అందుకోని వైసీపీ నాయకుడు జిల్లాలోనే లేరని చెప్పారు.
ఇప్పుడు అలాంటి నాయకుడిపైనే జగన్ విమర్శలు చేయడం.. ఆయనను వేరే రూపంలో చూపించే ప్రయత్నం చేయడం సహజంగానే వేమిరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఆయన మరింతగా పట్టుదలకు పోతే.. అది వైసీపీకి నష్టం తెచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వారికి వేమిరెడ్డిసాయం చేశారు. వచ్చేఎన్నికల్లోనూ ఆయన పట్టుబడితే.. నెల్లూరులో వైసీపీ ఆశలు వదులు కోవడం ఖాయమని అంటున్నారుపరిశీలకులు.
ఆర్థికంగా ఎలా ఉన్నా.. మంచి పేరు, ప్రజల్లో మంచిని సంపాయించుకున్న వేమిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా.. ప్రజల్లోనే వైసీపీ నాయకులు చులకన అవుతారు. తద్వారా అది సింపతీగా మారితే.. వేమిరెడ్డి కుటుంబానికి మేలు చేసినట్టు అవుతుంది తప్ప.. వైసీపీకి కాదని చెబుతున్నారు. ఈ విషయంలో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని కూడా చెబుతున్నారు. వాస్తవానికి వేమిరెడ్డి వ్యవహారం.. నెల్లూరులో ఇప్పటికీ పాజిటివిటీగానే ఉందన్న విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తించాల్సి ఉంటుందని కూడా పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 9, 2025 11:45 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…