Political News

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు. వారు వేసే అడుగులు చేసే పనులే వారిని వెనక్కి నెడతాయి లేదా ముందుకు తీసుకువెళ్తాయి. రాజకీలాల్లో స్వయంకృత తప్పులు నాయకులకు ఇబ్బందిగా మారుతాయి. ఈ విషయంలో వైసీపీ అధినేత తనను తానే డైల్యూట్ చేసుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

వాస్తవానికి ఏ పార్టీ అయినా పుంజుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. కానీ వైసీపీలో ఆలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలంతా ఒక వైపు ఉంటే వైసీపీ మరో బాటలో ప్రయాణిస్తోంది. తాజాగా జగన్ ప్రస్తావించిన అంశాల్లో ప్రజా కోణం కనిపించకపోగా మరింత బలంగా తన తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. వీటిని ప్రజలు ఏవగించుకుంటున్నారన్న స్పృహ కూడా కనిపించడం లేదు.

తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి వినియోగించారన్నది వాస్తవమని సీబీఐ తేల్చి చెప్పింది. నెల్లూరు కోర్టుకు సీబీఐ అందించిన రిపోర్టులో ఇది స్పష్టంగా ఉందని మీడియా పేర్కొంది. అయినప్పటికీ జగన్ మాత్రం ఎక్కడా కల్తీ జరగలేదని వాదించారు. నిజానికి తప్పు జరిగినప్పుడు దానిని ఒప్పుకోవడం ప్రజలకు సంజాయిషీ ఇవ్వడం ద్వారా వారి అభిమానాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కానీ జగన్ వైఖరిలో మార్పు రాలేదు.

పరకామణి కేసులోనూ ఇదే విధంగా ఆయన వ్యాఖ్యానించారు. శ్రీవారి నగదును కొట్టేయడమే తప్పని ప్రజలు భావిస్తుంటే జగన్ దీనిని లైట్ తీసుకున్నారు. ఇది మైనస్ కాదా అనేది వైసీపీలోనే నాయకులు చర్చించుకుంటున్నారు. పైగా దీనిని సమర్థించుకుంటూ రాజకీయ కారణంగానే దీనిని పెద్దది చేశారన్న వివరణ ఇవ్వడం మరొక విడ్డూరం.

అంతేకాదు తమ పాలనకు తానే సర్టిఫికెట్ ఇవ్వడం జగన్ చేస్తున్న మరో తప్పు. అమరావతి రాజధాని నుంచి రైతుల దాకా వైసీపీ హయాంలో తప్పులు జరిగాయి. భవిష్యత్తులోనూ ఇలానే ఉంటారా అన్న సందేహాలు ముసురుకున్నాయి. ఇలాంటి సమయంలో వాటిని జరగకుండా చూస్తామని చెప్పాల్సిన జగన్ సమర్థించుకోవడం తమ పాలనకు మార్కులు వేసుకోవడం ద్వారా వైసీపీ గ్రాఫ్‌ను ఆయనే తగ్గించుకుంటున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో జగన్ మరొక మూడు సంవత్సరాలు ఇలాగే ఉండాలని టీడీపీ నాయకులు చమత్కరిస్తున్నారు.

This post was last modified on December 6, 2025 7:59 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago