Political News

ఏపీలో ఏంటీ ‘చిన్న పురుగు’ టెన్షన్

ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు ఏమిటీ పురుగు..? దాని వల్ల జ్వరాలు రావడం ఏమిటి..? ఓ మహిళ మరణించింది అనే వార్తలు రావడం ఏమిటి..?  అనే అంశాలపై ఏకంగా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. మూడేళ్ల క్రితం ఢిల్లీ, తమిళనాడును షేక్‌ చేసినా స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఏపీలో వస్తున్నాయి. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదు పై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. చిగ్గర మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనేదానిపై ప్రజలకు వివరించాలని సూచించారు. ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు.

చిగ్గర మైట్స్ అనే కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం వంటివి ఈ వ్యాధి లక్షణాలని వివరించారు. సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మేరకు స్క్రబ్ టైఫస్ వంటి వ్యాధి పట్ల ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు.

ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలైంది. ఈ వ్యాధి బారిన పడి విజయనగరానికి చెందిన మహిళ మృతి చెందడంతో భయాందోళనకు గురవుతున్నారు జనం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మహిళ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా ఆమెకు స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ కేసులు వందలకు చేరినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

This post was last modified on December 3, 2025 8:54 am

Share
Show comments
Published by
Kumar
Tags: Scrub typhus

Recent Posts

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

21 minutes ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

3 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

4 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

4 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

6 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

6 hours ago