Political News

‘స‌ర్’ కోసం టీడీపీ ఆరాటం.. రీజనేంటి?

ఇత‌ర రాష్ట్రాలు వ‌ద్దని గోల చేస్తున్న ‘స‌ర్‌’ ప్ర‌క్రియ‌పై ఏపీ అధికార పార్టీ టీడీపీ సానుకూలత వ్య‌క్తం చేయడం.. ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా ఏపీలో స‌ర్ ప్ర‌క్రియను ప్రారంభించేలా కేంద్రాన్ని కోర‌తామని.. ఆపార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు చెప్ప‌డం విశేషం. కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్‌(స‌ర్‌) ద్వారా 2001కి ముందు ఓటు హ‌క్కు ఉన్న ప్ర‌తి ఒక్క‌రి నుంచి ఆధారాలు సేక‌రిస్తారు. దీని ద్వారా ఓటు హ‌క్కును నిర్ధారిస్తారు.

అన‌ధికార‌, మృతి చెందిన‌, వేరే ప్రాంతం నుంచి వ‌ల‌స వ‌చ్చిన వారి ఓట్ల‌ను జాబితాల‌ను తొల‌గిస్తారు. దీనినే స‌ర్ ప్ర‌క్రియ‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంటోంది. దీనిని సుప్రీంకోర్టు కూడా స‌మ‌ర్థించింది. అయితే.. దీనిపై వివాదాలు కూడా ముసురుకున్నాయి. ప్ర‌తిప‌క్షాల అనుకూల ఓట్ల‌ను తొల‌గించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌ర్ ప్ర‌క్రియ‌ను చేప‌డుతున్నార‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్య‌మాలు.. ఓట్ చోరీ అంటూ నిర‌స‌న‌లు చేప‌ట్టింది.

అయితే. ఈ ఆందోళ‌న‌లు, నిర‌స‌నల వెనుక ఉన్న వాస్త‌వాలు ఏంటి? స‌ర్ ప్ర‌క్రియ నిజంగానే ఓట‌ర్ల హ క్కుల‌ను తుడిచిపెడుతోందా? అనేది సందేహ‌మే. దీంతో ఈ ప్ర‌క్రియ నిరాఘాటంగా ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ స‌ర్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని.. టీడీపీ కోరుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం వ‌చ్చే ఏడాదిఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. త‌ద్వారా.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌న్న‌ది ఎన్నిక‌ల సంఘం వాద‌న‌.

ఏపీలో స‌ర్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌డం ద్వారా.. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ముంద‌స్తుగా మార్పులు-చేర్పుల‌కు అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది టీడీపీ వ్యూహం. అందుకే… స‌ర్ ప్ర‌క్రియను త్వ‌ర‌గా చేప‌ట్టేలా.. పార్ల‌మెంటులో ఈ విష‌యాన్ని చ‌ర్చిస్తామ‌ని ఆ పార్టీ ఎంపీ లావు చెప్పుకొచ్చారు. దీనిపై పార్ల‌మెంటులో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తామ‌న్నారు. ఇక‌, ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎలాంటి గ‌ళం వినిపించ‌డం లేదు. స‌ర్‌పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on December 1, 2025 11:08 am

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

8 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

10 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

10 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

13 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

14 hours ago