మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ పడితే అందులో రెబల్ క్యాండిడేట్లే 415 మందట. తమ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు.. ఇండిపెండెట్లుగా బరిలోకి దిగి ఎవరికి చేయాల్సిన నష్టం వాళ్లు చేశారు. ఈ రెబల్స్ వల్ల కొన్ని చోట్ల ఫలితాలు తారుమారు అయిపోయాయి. ఐతే ఇందులో టీఆర్ఎస్ వాళ్లున్నారు. బీజేపీ వాళ్లున్నారు. అలాగే కాంగ్రెస్, టీడీపీ వాళ్లూ ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమై, వెనక్కి తగ్గిన జనసేన నుంచి మాత్రం ఒక్కరూ రెబల్ క్యాండిడేట్ లేరట. ఈ విషయాన్ని జనసేన వాళ్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.
పార్టీ ఎన్నికల బరిలో ఉంటుందని ప్రకటన చేశాక పోటీకి చెప్పుకోదగ్గ సంఖ్యలోనే అభ్యర్థులు సిద్ధమై ఉంటారు. కానీ రెండు రోజులు తిరిగే సరికి పవన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. జనసేన పోటీలో ఉండదని, తమ పార్టీ మద్దతుదారులంతా బీజేపీకి అండగా నిలవాలని అధినేత పిలుపునిచ్చాడు.
పవన్ మాట మార్చడంపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. జనసేన మద్దతుదారులే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ ట్రెండ్ చూశాక జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లలో కొందరు ఎన్నికల బరిలో ఉంటారేమో అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఆ పార్టీ నుంచి రెబల్స్ ఎవరూ పోటీ పడలేదు. తమ అధినేత మాట మీద గౌరవంతోనే జనసేన నుంచి ఎవరూ రెబల్స్‌గా మారలేదని పవన్ గురించి ఎలివేషన్లు ఇస్తున్నారు కొందరు. కానీ ఇది చూసి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి జనసైనికులది.
మామూలుగా ఓ పార్టీకి ఒక చోట బలం ఉంటే.. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లు తమ పార్టీ పోటీకే దూరమైతే ఊరుకోరు. తమ అసహనాన్ని ఏదో రకంగా చూపిస్తారు. బయట ఆందోళనలు చేస్తారు. లేదంటే రెబల్స్ అవుతారు. తమ అధినేత మాటను ధిక్కరించి పోటీలో నిలుస్తారు. అలాంటిదేమీ జరగలేదంటే కేవలం అధినేత మీద గౌరవంగానే అనుకోవాలా.. లేక ఆ పార్టీకి ఇక్కడ బలం లేకపోవడం వల్ల, పోటీ చేసి గెలుస్తామన్న ధీమా ఉన్న నాయకులు లేకపోవడం వల్ల ఎవరూ బరిలో లేరనుకోవాలా?
This post was last modified on December 6, 2020 12:47 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…