గోదావరి జిల్లాల పచ్చదనం వల్లనే రాష్ట్రం విడిపోయిందేమో అనిపిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నవ్వుతూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నాయకుల దిష్టి తగిలి గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం కోనసీమలో తలలు లేని మొండెం మాదిరి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయని పవన్ అన్నారు. ఈ క్రమంలోనే పవన్ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలోనే పవన్ పై ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.
పవన్ కళ్యాణ్‌వి తెలివితక్కువ మాటలని, మైండ్ లెస్ అని జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దిష్టి వాళ్ళకి తాకలేదని, హైదరాబాద్ కే వారు వచ్చి పోతుంటారు కాబట్టి వారి దిష్టి తెలంగాణకు తగిలిందని అన్నారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ పవన్ ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నుంచి కోనసీమకు ఎక్కువగా తెలంగాణ ప్రజలు వెళ్లరని..మాట్లాడేటప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోకుండా, మెదడు వాడకుంటా ఈ తరహా వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. కావాలంటే కోనసీమ కొబ్బరి తోటలలో దిష్టిబొమ్మలు పెట్టుకోవాలని పవన్ పై సెటైర్లు వేశారు. పవన్ వి పిచ్చి పిచ్చి మాటలని, తెలివితక్కువ మాటలని జగదీష్ రెడ్డి విమర్శించారు. మరి, జగదీష్ రెడ్డి కామెంట్లపై జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on November 27, 2025 4:41 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…