Political News

ఎన్ని రోజులైనా జైల్లో ఉంటా.. కానీ, ఆ ప‌ని చేయొద్దు: చెవిరెడ్డి

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఏసీబీ కోర్టులో క‌న్నీరు మున్నీర‌య్యారు. తాజాగా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్ట‌యిన చెవిరెడ్డిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు మ‌రో 14 రోజ‌లు పాటు రిమాండ్ విధించారు. అయితే.. ఈ స‌మ‌యంలో చెవిరెడ్డి.. అనూహ్యంగా నోరు విప్పారు. న్యాయాధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. త‌న‌పై అన‌వ‌స‌రంగా కేసు న‌మోదు చేశార‌ని.. ఇది రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌న్నారు.

అయితే.. అవ‌న్నీ తాను నీతి, నిజాయితీతో సంపాయించుకున్న ఆస్తుల‌ని.. ఒక్క‌రూపాయి కూడా అవినీతి లేద‌ని చెవిరెడ్డి చెప్పారు. త‌న తాత‌తండ్రుల నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తుల‌ను తాను అభివృద్ది చేసుకున్నాన‌ని.. ఒక‌రిని అన్యాయం చేసి రూపాయి కూడా సంపాయించుకోలేద‌న్నారు. వీటిని జ‌ప్తు చేయ‌డం ‘ధ‌ర్మం’ కాద‌ని చెవిరెడ్డి చెప్పారు. కావాలంటే.. కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నాళ్ల‌యినా.. త‌న‌ను జైల్లో పెట్టుకోవ‌చ్చ‌న్నారు. తాను కూడా ఎన్నాళ్ల‌యినా జైల్లో ఉండేందుకు మాన‌సికంగా సిద్ధంగా ఉన్నాన‌ని చెవిరెడ్డి చెప్పారు. అయితే.. ఈ విష‌యం త‌మ ప‌రిధిలో లేద‌ని.. సిట్ అధికారులు పిటిష‌న్ దాఖ‌లు చేయాల్సి ఉంద‌ని కోర్టు వ్యాఖ్యానించింది.

అనంత‌రం.. మ‌ళ్లీ చెవిరెడ్డిని విజ‌య‌వాడ జైలుకు త‌ర‌లించారు. ఇదిలావుంటే.. ప్ర‌భుత్వం ఇటీవ‌ల అక్ర‌మ మ‌ద్యం వ్య‌వహారంలో చెవిరెడ్డి ఆస్తుల‌ను జ‌ప్తు చేసుకునేందుకు సిట్ అధికారుల‌కు అనుమ‌తి ఇచ్చింది. అయితే..దీనిపై న్యాయ‌ప్ర‌క్రియ చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని చెవిరెడ్డి త‌ర‌ఫు న్యాయ‌వాదులు తెలిపారు. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చినా.. కోర్టు అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు నుంచి సిట్‌ అధికారులు అనుమ‌తి తీసుకోలేద‌ని చెప్పారు. ఏసీబీ కోర్టులో పిటిష‌న్ వేసిన‌ప్పుడు త‌మ వాద‌న‌లు వినిపిస్తామ‌ని తెలిపారు. మ‌రోవైపు.. ఇప్ప‌టికే ఈ కేసులో ఏ1గా ఉన్న‌ రాజ్ క‌సిరెడ్డి ఆస్తుల్లో సుమారు 100 కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల‌ను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం సీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

దీనికి అప్ప‌ట్లో కోర్టు అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే చెవిరెడ్డి ఆస్తుల‌ను సీజ్ చేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి కోరింది. దీనికి స‌ర్కారు ఓకే చెప్పింది. దీనిపై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన త‌ర్వాత‌..ఆస్తుల‌ను సీజ్ చేయ‌నున్నారు. మొత్తంగా 65 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చెవిరెడ్డి ఆస్తుల‌ను జ‌ప్తు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఈ ఆస్తుల‌ను మ‌ద్యం అక్ర‌మాల ద్వారా వ‌చ్చిన సొమ్ముల‌తోనే చెవిరెడ్డి కొనుగోలు చేశార‌ని సిట్ అధికారులు చెబుతున్నారు. వీటిలో చిత్తూరు జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో భూములు, స్థిరాస్తులు ఉన్నాయి.

This post was last modified on November 22, 2025 11:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిఠాపురం కాదు, మంగళగిరి కాదు, ఏపీలో టాప్ నియోజకవర్గం ఇదే!

ఏపీలో 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుక‌బ‌డి ఉన్నాయి. మ‌రికొన్ని మ‌ధ్య‌స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…

2 hours ago

తమిళంలో డెబ్యూ హీరో సంచలనం

ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…

5 hours ago

ఓడిన వైసీపీకి 10 కోట్లు, గెలిచిన టీడీపీకి…

రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌ముఖ సంస్థ‌లు విరాళాలు ఇవ్వ‌డం కొత్త‌కాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వ‌డం(వాటి ఇష్ట‌మే…

6 hours ago

తెలంగాణ నాయకుల జాబితాకు తోడయ్యిన వైఎస్ షర్మిల

కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…

7 hours ago

అసెంబ్లీలో కండోమ్ లతో డెకరేషన్.. ఎప్పుడు..? ఎందుకు..?

ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…

8 hours ago

వికలాంగులతో కేక్ కట్ చేయించిన పవన్

ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…

8 hours ago