Political News

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మరో బాంబు పేల్చిన కవిత

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. మాజీ ఎంపీ క‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “నేను ఆ ప‌నిచేస్తే.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు జంప్ అవుతారేమో.. ఆ విష‌య‌మే ఆలోచిస్తున్నా“ అని అన్నారు. జాగృతి జ‌నం యాత్ర నిర్వ‌హిస్తున్న క‌విత .. తాజాగా శుక్ర‌వారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో యాత్ర చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి అనుచరులు ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు.

చెరువుల‌ను ఆక్ర‌మించి పెద్ద ఎత్తున భ‌వ‌నాలు నిర్మించుకుంటున్నార‌ని క‌విత ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా త‌న వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. వీరిలో కొంద‌రు ఎమ్మెల్యేలు కూడా ఉన్నార‌ని చెప్పారు. వీటిపై హైడ్రా ఏం చేస్తోంద‌ని ప్ర‌శ్నించారు. పేద‌ల‌కు చెందిన ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రాకు ఇవ‌న్నీ క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. అయితే.. త‌ప్పులు చేసిన వారు అధికార పార్టీలో చేరిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. అందుకే హైడ్రా మౌనంగా చూస్తూ కూర్చుంద‌ని క‌విత విమ‌ర్శించారు.

త‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను హైడ్రాకు స‌మ‌ర్పిస్తాన‌ని.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూస్తాన‌ని క‌విత చెప్పారు. “అయితే..ఇక్క‌డో స‌మ‌స్య ఉంది. నేను ఆధారాల‌తో స‌హా హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంట‌నే స‌ద‌రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవ‌కాశం ఉంది. ఇక‌, వారికి క్లీన్ చిట్ వ‌స్తుంది. ఎంత మందిని చూడ‌డం లేదు“ అని క‌విత వ్యాఖ్యానించారు. అయితే.. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న అనుచ‌రులే భూముల‌ను, చెరువుల‌ను ఆక్ర‌మించుకుని ఇళ్లు క‌ట్టుకుంటున్నా.. మాజీ మంత్రి స‌బిత ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

మహేశ్వరం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రావిర్యాల, మంత్రాల చెరువులలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలకు పాల్పడు తున్నారని క‌విత తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా త‌న వ‌ద్ద ఉన్నాయ‌న్నారు. ఇక‌, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో ఓట‌మి త‌ర్వాత బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. “నాకు ఉన్న స‌మాచారం మేర‌కు.. ఇద్ద‌రు నుంచి ముగ్గురువ‌ర‌కు.. పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఎవ‌రి సేఫ్ వారు చూసుకుంటున్నారు.“ అని కవిత చెప్పారు. కాగా.. ఇదే విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 21, 2025 10:31 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

5 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago