విశాఖలో ఐసీసీ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. చివరిరోజు విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశం అయ్యింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేసాయో చెబుతూ, ప్రజాధనం కాపాడటానికి కార్మికులు కూడా బాధ్యతగా పని చేయాలని చంద్రబాబు చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పిన దాన్ని వక్రీకరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపణ.
వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ ఉక్కుని తుక్కు కింద పోస్కోకి అమ్మేద్దామని వైఎస్ జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారని టీడీపీ చెబుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్రంతోనే ప్రకటన చేయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 12 వేల కోట్ల ప్యాకేజీ సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2600 కోట్లు ఇచ్చారు.
“రూ. 12 వేల కోట్ల ప్రజాధనం స్టీల్ ప్లాంట్‌లో ప్రభుత్వాలు పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 2,600 కోట్లు పెట్టింది. ప్రజాధనం వృథా కాకుండా, అందరం బాధ్యతగా పని చేద్దాం అని చంద్రబాబు గారు చెప్తే, దానిని కూడా వక్రీకరించి జగన్ ఫేక్ ప్రచారం చేస్తున్నాడు.” అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరించారు.
ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎవరేమి చేశారో వివరిస్తూ టీడీపీ ఒక పోస్టర్ విడుదల చేసింది. వైసీపీ ప్రభుత్వం పోస్కో కి అమ్మే ప్రయత్నం చేయగా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ అవ్వబోదని కేంద్రంతో ప్రకటన చేయించింది. రెవినల్ ప్యాకేజ్ కింద 12 వేల కోట్లు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ సాయంగా రూ.2,600 కోట్లు అందించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లాంటి ఉత్పత్తి సామర్థ్యం 20 శాతం మాత్రమే కాగా, నేటి ప్రభుత్వంలో అది 79 శాతానికి పెరిగింది. అప్పట్లో ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ పని చేసేది. ఇప్పుడు మూడు పని చేస్తున్నాయి. మొత్తం మీద ప్యాకేజీ ఇచ్చి ప్లాంటును లాభాల బాట పట్టించి, ఉద్యోగులకు బాబు నాయుడు అండగా నిలిచారని తెలుగుదేశం పార్టీ వివరించింది.
This post was last modified on November 18, 2025 9:22 am
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…