వ్యవసాయ ఆధారిత దేశమైన మనదగ్గర ఓటు బ్యాంకు కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లోనే పోటెత్తుతుండడం గమనార్హం. ఎన్ని పట్టణాలు ఉన్నా.. నగరాలు ఉన్నా.. పల్లెల్లోనే ఓటు బ్యాంకు సంపూర్ణం. అయితే, ఇప్పుడు అదే పల్లెల్లో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆయన తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలపై అన్నదాతలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. మద్దతు ధరలకు నానాటికీ గండి కొడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దీనిని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా తీసుకువచ్చిన కొత్త చట్టాలపై ఉత్తరాది రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి.
యూపీ, బిహార్, పంజాబ్, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల నుంచి రైతన్నలు కదం తొక్కతున్నారు. సదరు చట్టాలను కేంద్ర సర్కారు వెనక్కితీసుకునే వరకు తమ ఉద్యమం విరమించేదిలేదని స్పష్టం చేస్తున్నాయి. అయితే, దీనిని ప్రతిష్టాత్మంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అంతే ఒత్తిడి తెచ్చి.. రైతులను లొంగ దీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యవాదులను కూడా నివ్వెర పరుస్తున్నాయి. నిజానికి సదరు చట్టాలను పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడే కేంద్ర మంత్రిగా ఉన్న పంజాబ్ నాయకురాలు కౌర్ రాజీనామా చేశారు. అయినా దీనిపై ఏమాత్రం మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
ఇక, తర్వాత పరిణామాల్లో కేంద్రంలోని ఎన్డీయేకు మద్దతుదారుగా ఉన్న శిరోమణి అకాలీదళ్ పార్టీ తనమద్దతును వెనక్కి తీసుకుంది. దరిమిలా.. ఇప్పుడు.. రైతులు రోడ్డెక్కారు. ఈ క్రమంలోనే ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రైతులపై పోలీసుల బలప్రయోగాలు కొన్నాళ్లు సాగినా.. అన్నదాతలు వెనక్కి తగ్గలేదు. ఎంతకైనా తాము సిద్ధమేనని ప్రకటించారు. ఇక, వీరికి మద్దతుగా క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు.. తమకు దేశం నుంచి లభించిన అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించారు. ఈ పరంపరలో తొలి అడుగుగా.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్..తనకు వచ్చిన పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాన్ని తిరిగి ఇచ్చేశారు.
ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి.. ఇది మోడీకి శరాఘాతమేనని అంటున్నారు పరిశీలకులు. ఇక, రాబోయే రోజుల్లో ఆయనకు మరింతగా ఈ వేడి తగిలే ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రైతులతో పెట్టుకున్న ఏ కేంద్ర ప్రభుత్వమూ బతికి బట్టకట్టింది లేదు. గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉల్లిపాయల ధరలను నియంత్రించలేక ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూలదోసుకున్న బీజేపీకి ఇది అనుభవమే. అయినప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మొండి పట్టుదలతో ముందుకు సాగుతోందనే అబిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఇప్పటికైనా మోడీ తీరు మారక పోతే.. మున్ముందు పరిస్థితి మరింత విషమంగా మారి..మూడోసారి ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం సన్నగిల్లుతుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 3, 2020 4:55 pm
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…