Political News

ఆ పల్లెకి.. లోకేష్ డ్రెస్ కి లింకేంటి..?

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే ఏపీ మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ పోస్టులతో సర్ప్రైజ్ చేస్తున్నారు. బిగ్ రివీల్ అంటూ నిన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధం అయిన పెద్ద కంపెనీల పేర్లను ఆయన టైమ్ చెప్పి మరీ వెల్లడించారు. అదే విధంగా ఈ రోజు మధ్యాహ్నం ఒక ట్వీట్ చేశారు. తాను వేసుకున్న జాకెట్(కోటు) ఎలా ఉంది అంటూ ఆయన ప్రశ్నించారు. దీనిని ఏ మెటీరియల్తో ఎక్కడ తయారు చేశారో తెలుసా అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మీరు ఊహించండి.. సరైన సమాధానం చెప్పిన వారికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్రకటించారు. దానికి సరైన సమాధానం తానే ఈ రోజు ఏడింటికి ప్రకటిస్తానని వెల్లడించారు.

లోకేష్ వేసుకున్న డ్రెస్ దేనితో తయారు చేశారని నెటిజర్లు చర్చించుకున్నారు. అయితే కరెక్ట్ గా ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. సరిగ్గా ఏడింటికి లోకేష్ తానే ఆన్సర్ ఇచ్చారు. ఈ జాకెట్ తయారు చేసింది మిలాన్‌ లో, ముంబైలో కాదు.. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం పులగుర్త గ్రామంలో తయారు చేసిందని తెలిపారు. చేనేతతో (మల్కా కాటన్) దీనిని తయారు చేశారని పేర్కొన్నారు. ఇది ఎంతో మృదువుగా ఉందని అన్నారు. కొన్ని ఉత్తమ ఫ్యాషన్లు మట్టి పుడతాయని ఆయన తెలిపారు. ఆ ఊరికి సంబంధించిన గూగుల్ మ్యాప్ కూడా ఆయన ట్వీట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పులగుర్త చేనేత సహకార సంఘం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సంఘం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ప్రోత్సాహం పొందుతోంది. ఇక్కడ ప్రధానంగా చేనేత వస్త్రాలు, ముఖ్యంగా మల్కా కాటన్ వస్త్రాలు, సహజ వనరులను ఉపయోగించి తయారు చేస్తారు. సహజ సిద్ధమైన ప్రకృతి వనరులతో తయారు చేసే చేనేత వస్త్రాలు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఈ గ్రామంలోని అనేక కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తాయి, ఇక్కడ చాలామంది కార్మికులు తమ మగ్గాలను మల్కా వస్త్రాల తయారీకి అనుగుణంగా మార్చుకున్నారు. పులగుర్త చేనేత వస్త్రాలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో బ్రాండ్ అంబాసిడర్లను గుర్తించడం మరియు ఫ్యాషన్ షోలు నిర్వహించడం వంటివి ఉన్నాయి. ఇప్పుడు నారా లోకేష్ ధరించిన జాకెట్ ఇక్కడే తయారు చేసిందే కావడం అందరినీ ఆకర్షించింది.

This post was last modified on November 16, 2025 11:28 am

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago