జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో టిడిపి అనుకూల ఓటు ఎవరికి పడింది? అసలు ఎవరికి పడాలి? ఇదీ ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఈ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీలో లేదు. పైగా ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తామని కూడా ఆ పార్టీ చెప్పలేదు. ఆది నుంచి తటస్థంగానే వ్యవహరిస్తామని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయినప్పటికీ అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇటు అధికారపక్షం కాంగ్రెస్ టిడిపి సానుకూల ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేశారన్నది వాస్తవం.
పలు ఇంటర్వ్యూలలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ టిడిపికి అనుకూలంగా మాట్లాడటం అదేవిధంగా దివంగత ఎన్టీఆర్ పేరు తనకు పెట్టారని చెప్పి సెంటిమెంట్లను రగిలించే ప్రయత్నం చేశారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా టిడిపి అనుకూల ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేసింది. దాదాపు 12 నుంచి 16% మేరకు టిడిపి అనుకూల ఓటు బ్యాంకు ఉందన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.
గతంలో మాగంటి గోపీనాథ్ టిడిపి నుంచి విజయం కూడా దక్కించుకున్న విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. అయితే తర్వాత టిడిపి ఏపీకే పరిమితం కావడం గత ఎన్నికల్లోనూ టిడిపి ఎవరినీ నిలబెట్టకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టిడిపికి బలంగా ఉన్న ఓటు బ్యాంకు ఎవరికి పడింది ఎవరు విజయం దక్కించుకునే దిశగా ఈ ఓటు బ్యాంకు సహకరించింది అన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చగా మారింది. గెలుపు, ఓటమి అనే విషయాలను పక్కన పెడితే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు ను తమ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేయడంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
చివరి నిమిషంలో లేవనెత్తిన అనేక అంశాలు టిడిపి సానుకూల ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించాయని వారు చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రబాబును ఏపీలో అరెస్టు చేసినప్పుడు అక్కడికి వెళ్లి ధర్నాలు నిరసనలు చేసుకోవాలని అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించారు. దీనిని ప్రచారంలోకి కూడా తీసుకువెళ్లారు. ఇది బాగా ఫలించింది అన్నది టిడిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో టిడిపి ఓటు బ్యాంకుతో పాటు సెటిలర్లు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారన్నది కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట.
ఈ రెండు విషయాలు ఎన్నికల్లో బాగా ప్రచారం జరిగి టిడిపి ఓటు కాంగ్రెస్ కి పడిందన్నది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ కు పడినప్పటికీ రెండు నుంచి మూడు శాతానికి మించి పడి ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి టిడిపిని బీఆర్ఎస్ వ్యతిరేకించడంతోపాటు చంద్రబాబు అరెస్టు సహా సెటిలర్ల పై కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా ప్రభావం చూపించాయి అన్న వాదనా వినిపిస్తుంది.
ఎలా చూసుకున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టిడిపి అనుకూల ఓటు బ్యాంకు అధికారం పక్షం వైపే మొగ్గిందన్నది పరిశీలకుల అంచనా. ఈ విషయంలో ఏం జరిగిందన్నది ఎలా ఉన్నప్పటికీ ఫలితం మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టిడిపి అనుకూల సానుకూల ఓటు బ్యాంకు పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉందన్నది పరిశీలకుల అంచనా.
This post was last modified on November 14, 2025 2:28 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…