తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పెట్టుబ డులు పెట్టేవారికి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా `రైజింగ్ తెలంగాణ – 2047`ను ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందన్నారు.
పెట్టుబడులతో వచ్చే కంపెనీల పేర్లను పలు వీధులకు పెట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు నాయకుల పేర్లు ఉన్నాయని, అయితే, యువతకు స్ఫూర్తినిచ్చేలా పెట్టుబడులు పెట్టే కంపెనీల పేర్లను రహ దారులకు పెట్టనున్నట్టు వివరించారు. దీనికి పారిశ్రామిక వేత్తల నుంచి భారీ స్పందన లభించింది. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన అన్ని సౌక ర్యాలకు తాను హామీ ఇస్తున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, పెట్టుబడులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తామని సీఎం చెప్పారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చడమే తమ ధ్యేయ మని వివరించారు. 23 మాసాల కాలంలో అనేక పెట్టుబడులు వచ్చాయని.. వచ్చే నెలలో పెట్టుబడుల సదస్సును(రైజింగ్ తెలంగాణ సదస్సు) నిర్వహిస్తున్నట్టు వివరించారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
This post was last modified on November 13, 2025 11:19 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…