ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన!” అంటూ ఆసక్తి రేకెత్తించారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లోకేష్ ఈ రోజు ఆసక్తికర ట్వీట్ చేశారు. “2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు ఆంధ్రప్రదేశ్‌లో దూసుకురానుంది! ఆ సంస్థ ఏమిటో తెలుసా..? రేపు ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన! ఆసక్తిగా ఎదురుచూడండి!!” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక కంపెనీలు ఏపీని వదిలి వెళ్లిపోయాయని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గడంతో విశాఖలో ఐటీ రంగం కుదేలైందనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయ భవనాలు ఖాళీగా మారి, ఉన్న కంపెనీలు మూతపడినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు.
గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన వల్ల రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందనేది టీడీపీ వాదన. అటువంటి పరిస్థితుల్లో, గతంలో వెళ్లిపోయిన ఒక పెద్ద కంపెనీ తిరిగి ఏపీకి వస్తోందని లోకేష్ తెలిపారు. “భారీ ప్రకటన వస్తోంది” అంటూ ఆయన సూచించారు.
This post was last modified on November 12, 2025 7:00 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…