Political News

సీఎం స్వయంగా పాడె మోశారు

ప్ర‌ముఖ కవి, తెలంగాణ ఉద్యమ గళం అందెశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి దశ వరకు స్వయంగా పర్యవేక్షిస్తూ, అందెశ్రీ కుటుంబానికి అండగా నిలిచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. స్వయంగా సీఎం పాడెను మోసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అందెశ్రీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అందెశ్రీ ప్రజల్లో చైతన్యం రగిలించిన వ్యక్తి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆయనను ఇంటర్వ్యూ చేసే అవకాశం తానందుకున్నానని, ఇద్దరం అనేక సందర్భాల్లో వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించడం గౌరవకరమైన నిర్ణయమని గుర్తు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆ గీతాన్ని అన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చుతామని సీఎం ప్రకటించారు.

“ప్రతి విద్యార్థి జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించేలా చేస్తాం. పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా తెలంగాణ నేలపై అందెశ్రీ కవితలు ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. అదే ఆయనకు నిజమైన ఘన నివాళి” అని సీఎం అన్నారు.

అలాగే అందెశ్రీ రచించిన నిప్పులవాగు పుస్తకాన్ని రాష్ట్రంలోని అన్ని చిన్న, పెద్ద గ్రంథాలయాల్లో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకునేందుకు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

This post was last modified on November 11, 2025 3:14 pm

Share

Recent Posts

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

19 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

20 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

4 hours ago