Political News

గెలిచినా.. ఓడినా.. రేవంత్‌కు లిట్మ‌స్ టెస్ట్‌!

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పెద్ద టెస్టే అనే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. 20 నెల‌ల‌కు పైగా సాగుతున్న `ఇందిర‌మ్మ‌` పాల‌న‌లో ప్ర‌జ‌ల‌కు ఎన్నో మేళ్లు చేశామ‌ని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్ర‌ధాన ప‌రీక్ష పెడుతోంద‌న్న వాద‌న పార్టీ వ‌ర్గాల్లోనూ వినిపిస్తోంది. అయితే.. ఎన్నిక‌లన్నాక‌.. గెలుపు-ఓట‌మి స‌హ‌జం. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? అనే విష‌యాలు ప్ర‌జల భావోద్వేగాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

పైగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సెంటిమెంటుతో కూడికున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ గెలుస్తుందా?  ఓడుతుందా? అనే విష‌యం కూడా ఎవ‌రినాడికీ అంద‌డం లేదు. అయితే.. ఒక‌టి మాత్రం వాస్త‌వం.. గెలిచినా.. ఓడినా.. సీఎం రేవంత్ రెడ్డికి ఇదొక లిట్మ‌స్ టెస్టు అనే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వేళ ఇక్క‌డ కాంగ్రెస్ గెలిస్తే.. పూర్తిస్థాయిలో ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు అనుకూలంగా ఉన్నార‌ని భావించే ప‌రిస్థితి ఉన్నా.. వ‌చ్చే ఓటు బ్యాంకును బ‌ట్టి ప్ర‌భుత్వ ప‌నితీరులో మ‌రింత మెరుగుప‌డాల్సిన సందేశాన్ని ప్ర‌జ‌లు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ కావ‌డంతోపాటు.. ప్ర‌జ‌లు ఎక్క‌డ ఏమేర‌కు తేడా చూపించార‌న్న విష‌యాన్ని అంచ‌నా వేసుకుని దానిని స‌రిచేసుకోవాల్సిన అవ‌స‌రం కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఏర్ప‌డుతుంది. ముఖ్యం గా సీఎం రేవంత్ రెడ్డి మార్పుల దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. ఇక‌, ఏదైనా తేడా వ‌చ్చి ప‌రాజ‌యం పాలైనా.. ప్ర‌భుత్వ ప‌నితీరు విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి మ‌రింతగాజాగ్ర‌త్త‌లు తీసుకోవడంతోపాటు.. ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకున్న నిర్ణ‌యాల‌ను స‌మీక్షించుకో వాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కు దాదాపు ఇక ఎన్నిక‌ల‌కు అవ‌కాశం లేనందున‌(స్థానికం మిన‌హా) ఈ ఉప ఎన్నిక ప్ర‌భుత్వానికి.. ఒక అవ‌కాశంగా మార‌నుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. గెలిచినా.. ఓడినా.. సీఎం రేవంత్ రెడ్డి ప‌నితీరుకు ఉప పోరు లిట్మ‌స్ టెస్టు వంటిదేన‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటిని పార్టీప‌రంగా, ప్ర‌భుత్వ ప‌రంగా ఆయ‌న మార్పులు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

This post was last modified on November 9, 2025 10:41 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

4 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

5 hours ago

కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…

6 hours ago

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

9 hours ago

‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’

దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…

9 hours ago

‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

10 hours ago