కేవలం 4 గంటల చర్చలు.. సీఎం చంద్రబాబు ఇచ్చిన భరోసా.. ఇంకేముంది.. ఏపీపై మరో లక్ష కోట్ల రూపాయల పైచిలుకు.. పెట్టుబడుల కనక వర్షం కురిసింది. ఇప్పటి వరకు జరిగిన పెట్టుబడుల ప్రయత్నాలు.. ఒక ఎత్తయితే, తాజాగా ఒక్క శుక్రవారం రోజే.. కేవలం 4 గంటల్లోనే భారీసంఖ్యలో సంస్థలు, పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం.. పెట్టుబడులు పెట్టేందుకు అంగీక రించడం.. తద్వారా ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం కావడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతో సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
శుక్రవారం.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సీఎం చంద్రబాబు.. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ ఐ పీబీ-స్టేట్ లెవిల్ ఇన్వెస్ట్‌మెంట్ పాజిబిలిటీ బోర్డ్) సమావేశం నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు.. పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈసందర్భంగా ఏపీలో ఉన్న అవకాశాలను వారికి సీఎం వివరించారు. రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా పెట్టుబడులు పెట్టాలని.. వారికి సూచించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వారికి వివరించారు. భూమి, నీరు, విద్యుత్ సహా పన్నుల విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 15 పారిశ్రామిక జోన్లను అభివృద్ధి చేయనున్నట్టు సీఎం వారికి వివరించారు.
దీనికి ముగ్ధులైన చాలా మంది పారిశ్రామిక వేత్తలు.. అక్కడికక్కడే తమ ప్రణాళికలు వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. వీరిలో రిలయన్స్ 202 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఓకేచెప్పింది. తద్వారా 436 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 700 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనివల్ల వెయ్యి ఉద్యోగాలు లభిస్తాయి. ఎన్‌పీఎస్‌పీఎల్ అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ భారీగా 2,081 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల 600 మందికి ఉద్యోగాలను అందించనున్నారు.
అదేవిధంగా క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్, ఎస్‌సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్పీ, ఇండిచిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్, మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ 7 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపింది. ఇలా పలు సంస్థలు ముందుకు వచ్చాయి. వీటి ద్వారా మొత్తంగా లక్ష కోట్ల రూపాయల పైచిలుకు ఒప్పందాలు జరిగాయి. వీటి వల్ల 85 వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి.
This post was last modified on November 8, 2025 12:51 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…