జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ మరో నాలుగు రోజుల్లో ఉందనగా.. బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంగా దివంగత మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి.. మాగంటి మహానంద కుమారి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి మరణంపై వాస్తవాలను వెల్లడించాలని కేటీఆర్‌ను ఆమె డిమాండ్ చేశారు. చివరి క్షణాల్లో కన్నకొడుకును చూడనీయకుండా చేశాడని కేటీఆర్‌పై ఆరోపణలు చేశా రు.
గోపీనాథ్.. ఆసుపత్రిలో ఉన్నప్పుడు.. కూడా తనకు చెప్పలేదని, ఆయన గురించి ఎవరో చెబితే తెలుసుకుని ఆసుపత్రికి వెళ్లినా.. లోపలికి రాకుండా తనను అడ్డుకున్నారని కుమారి వ్యాఖ్యానించారు. తర్వాత.. తాను స్వయంగా కేటీఆర్… తన కుమారుడిని చూడాలని వేడుకున్నట్టు చెప్పారు. అయితే.. ఆయన పట్టించుకోకుండా, కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తలుపులు వేసేసుకుని వెళ్లిపోయారన్నారు.
ఐసీయూలో మూడు రోజుల పాటు ఉన్నారని.. మాగంటి చనిపోయిన విషయాన్ని కూడా తమకు చెప్పకుండా దాచారని అన్నారు. ఈ విషయంపై తమకు కేటీఆర్ సమాధానం చెప్పాలని మహానంద కుమారి డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమె..ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను మాగంటి సునీతకుఇవ్వడంపై విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సునీత, కేటీఆర్‌లు కలిసి.. తనను ఐసీయూలోకి కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
“ఆసుపత్రి అధికారులు తల్లి అయినప్పటికీ నన్ను అనుమతించవద్దని వారి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన విషయం కూడా నాకు తెలియజేయలేదు. ఒకసారి, నేను ఐసియు బయట వేచి ఉండి, అనుకోకుండా కెటిఆర్‌ను కలిశాను. నా కొడుకును చూడటానికి నన్ను అనుమతించమని అభ్యర్థించినప్పటికీ, అతను తలుపు మూసివేసి వెళ్లిపోయాడు,”అని ఆమె వ్యాఖ్యానించారు.
తన కుమారుడి మరణంపైనా కేటీఆర్ స్పందించాలని మహానంద కుమారి డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే.. గోపీనాథ్ మరణం అనంతరం.. ఆరునెలల తర్వాత కావాలనే రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఎదురుదాడికి దిగారు. పోలింగ్ కు నాలుగైదు రోజులముందు కుట్రలు చేస్తున్నారని.. ఓటమి భయంతోనే అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
This post was last modified on November 7, 2025 9:43 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…