ఏపీ సీఎం చంద్రబాబు కలలను విశాఖలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు సాకారం చేయనుందా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. పెట్టుబడుల వేటలో సుదీర్ఘంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌లు ఇప్పటికే దుబాయ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, లండన్ సహా పలు దేశాల్లో పర్యటించారు. మొత్తంగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన 16 మాసాల్లో మొత్తం 10 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు రాబట్టారు.
ఇక, ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న విశాఖ పెట్టుబడుల సదస్సు మరింతగా ఈ పెట్టుబడులకు ఊపు తెస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్రానికి, ముఖ్యంగా పెట్టుబడుల కల్పనకు కూడా గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ఇక, ఈ సదస్సులో కనీసంలో కనీసం.. మరో 10 లక్షల కోట్ల రూపాయల వరకు అదనంగా పెట్టుబడులు సాధించే అవకాశం ఉందని సర్కారు అంచనా వేస్తోంది. ఏయే రంగాలు కీలకంగా ఉన్నాయి? ఏయే రంగాల్లో పెట్టుబడులు వస్తాయి? అనే విషయాలపై అధ్యయనం చేస్తున్నారు.
ప్రభుత్వ అంచనాలు ఇవీ..
పెట్టుబడుల సదస్సుకు 45 దేశాల నుంచి 300 పారిశ్రామికవేత్తలు వస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ సదస్సులో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొనే అవకాశం ఉందని లెక్కలు కట్టారు. మొత్తంగా ఆయా కంపెనీలు, సంస్థలతో 410 ఎంవోయూలను కుదుర్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. వీటి ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు.. మరో 7.5 లక్షల ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా ఉంది.
ఇక, గత 16 నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన కంపెనీలు కూడా విశాఖ వేదికగా.. తమ ఆవిష్కరణలకు సంబంధించిన కీలక ప్రకటన చేయడంతోపాటు.. ఒప్పందాలు కూడా చేసుకోవడం ఖాయమని ప్రభుత్వం భావిస్తోంది.
జిల్లాల వారీగా పెట్టుబడులు..
This post was last modified on November 6, 2025 9:52 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…