Political News

జూబ్లీహిల్స్ లో మాటల యుద్ధం – కాంగ్రెస్ vs బీఆర్ఎస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల ప్రచారంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకుంటున్నారు. మాటకు మాట అన్న‌ట్టుగా.. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీలు బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌లు.. విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నాయి. ప్ర‌చారంలో ఆయా పార్టీల కీలక నాయ‌కులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు, ఇస్తున్న హామీల‌పై ఇరు ప‌క్షాలు.. ప‌ర‌స్ప‌రం కౌంట‌ర్ వేస్తున్నాయి. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.. రెహ‌మ‌త్ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్‌ను గెలిపించాల‌ని కోరారు.

అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ స‌మ‌స్య‌ల‌ను మంత్రి ప్ర‌స్తావించారు. గ‌త ప‌దేళ్ల‌లో బీఆర్ ఎస్ ఇక్కడిస‌మ‌స్య‌ల‌ను ప‌రి ష్కరించ‌లేద‌న్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇందిర‌మ్మ ఇళ్ల‌ను పేద‌ల‌కు ఇస్తున్నామ‌న్నారు. జూబ్లీహిల్స్‌లో న‌వీన్ యాద‌వ్‌ను గెలిపిస్తే.. వ‌చ్చే మూడేళ్ల‌లో ఈ నియ‌జక‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. బీఆర్ ఎస్‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పారు. ఆ పార్టీ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించిమోసం చేసింద‌న్నారు.

అయితే.. పొంగులేటి వ్యాఖ్య‌ల‌పై బీఆర్ ఎస్ నుంచి అంతే షార్ప్‌గా స్పంద‌న వ‌చ్చింది. వ‌చ్చే మూడేళ్ల సంగ‌తి ఎలా ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు రెండేళ్ల‌లో జూబ్లీహిల్స్‌కు ఏం చేశారో చెప్పాల‌ని ఆ పార్టీ అభ్య‌ర్థి మాగంటి సునీత ప్ర‌శ్నించారు. మాట‌లు చెప్పి.. మ‌భ్య‌పుచ్చి ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. వారి మాట‌ల‌ను విశ్వ‌శించ‌వ‌ద్ద‌ని ఆయ‌న జూబ్లీహిల్స్ ప్ర‌జ‌ల‌ను కోరారు. అయితే.. బీఆర్ ఎస్ నేత చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దీటుగా స్పందించింది.

బీఆర్ ఎస్‌లో కుటుంబ రాజ‌కీయాలు సాగుతున్నాయ‌ని మంత్రులు వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌బోర‌ని.. వారి కుటుంబాల‌కు మేలు చేసుకుంటున్నార‌ని.. నియోజ‌క‌క‌వ‌ర్గం అభివృద్ధికి మాగంటి కుటుంబం ఏం చేసిందో చెప్పాల‌న్నారు. వారి ఆస్తులు పెరిగాయ‌ని.. జూబ్లీహిల్స్‌లో పేద‌వాడి ఆస్తులు క‌రుగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఇలా .. ఒక‌రి వ్యాఖ్య‌ల‌పై ఒక‌రు కౌంట‌ర్ వేయ‌డం.. ప్ర‌చారాన్ని మ‌రింత వేడెక్కిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఓట‌రు ఎటు వైపు మొగ్గు చూపుతాడ‌న్న‌ది చూడాలి.

This post was last modified on November 1, 2025 10:09 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

20 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

26 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

52 minutes ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago

కొట్లాట కొత్త కాదు రేవంత్ చెబితే రాజీనామా దానం కీలక కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…

3 hours ago