Political News

బీహార్‌లో ప్రచారం చేస్తా: చంద్రబాబు

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కీలకమైన రాష్ట్రం బీహార్‌లో తాను కూడా ప్రచారం చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఈ దశాబ్దపు నాయకుడిగా అభివర్ణించిన ఆయన, సంస్కరణలను తీసుకురావడం ద్వారా దేశ పురోభివృద్ధిలో ఆయన దూసుకుపోతున్నారని చెప్పారు. బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఏర్పాటు అవుతుందని అన్నారు.

దీనికి సంబంధించి తన వంతు పాత్ర పోషిస్తానన్న చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో తనకు కొన్ని దశాబ్దాలుగా అనుబంధం ఉందని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పడం ద్వారా మోడీ అందరినీ ఆకట్టుకున్నారని చెప్పారు. షెడ్యూల్ నిర్ణయించిన తర్వాత తాను కూడా బీహార్‌లో పర్యటించి ఎన్డీయే విజయం కోసం బాటలు వేస్తానని తెలిపారు.

ఇక ఇటీవ‌ల దసరా ముందు తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలు పొదుపు చేసుకుంటున్నారని తెలిపారు.

ఇది ఒకరకంగా పెద్ద సంస్కరణ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా పన్నులు పెంచిందే తప్ప తగ్గించలేదు. ఇలా జరగడం ఇదే తొలిసారి. దీనికి ప్రధాని మోడీ ఉదారతే కారణం. అందుకే ఆయన దశాబ్దపు నాయకుడు అనిచెబుతా. దీని వల్ల పేదలు, మధ్యతరగతి పరోక్షంగా లాభం పొందితే, వ్యాపార వర్గాలకు కూడా ప్రత్యక్ష లాభం జరుగుతోంది. ప్రధాని మోడీకి విజయాలే తప్ప ఇప్పటి వరకు అపజయం అన్నది ఎరుగరు. 2000 సంవత్సరం నుంచి ఆయన 25 ఏళ్లుగా అప్రతిహతంగా విజయం దక్కించుకుంటున్నారు. అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

ఏపీలో…

ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం దూసుకుపోతోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకే ఏడాదిలోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిహామీని అమలు చేశామని తెలిపారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ ద్వారా ప్రజల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేశామని చెప్పారు. ఇది తమకు సానుకూలంగా మారుతుందని, వచ్చే ఎన్నికలలోనూ తాము విజయం దక్కించుకుంటామని చంద్రబాబు భరోసా వ్యక్తం చేశారు.

This post was last modified on October 25, 2025 4:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

2 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

4 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

4 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

4 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

13 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

13 hours ago