తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం.. వివాదం కూడా అయిన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి పెండింగులోనే పడింది. ఇది అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. న్యాయ ప్రక్రియ నుంచి అనేక రాజకీయాలకు వరకు రిజర్వేషన్ విషయం తీవ్రమైన ఉత్కంఠ రేపింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు.. ప్రభుత్వం పోరాడినా.. తిరిగి ఇది పెండింగులోనే ఉంది.
ఈ క్రమంలో తాజాగా గురువారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని అందరు అనుకున్నారు. ముఖ్యంగా మంత్రులు కూడా దీనిపై చూచాయగా లీకులు ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సుదీర్ఘంగా మంత్రి వర్గ సమావేశం జరిగింది. కానీ, ఈ సమావేశంలో ఎక్కడా స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్ విషయం ప్రస్తావనకు రాలేదు.
అంటే, దీనిని బట్టి.. కోర్టు తీర్పులు వచ్చే వరకు ఇక, రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం పెద్దగా సీరియస్‌గా తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఇటీవల పలు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంలా, తెలంగాణ కేబినెట్ కూడా తాజా నిర్ణయం తీసుకుంటే.. ఇద్దరు పిల్లలు ఉంటే.. ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తీసేసింది. ఇకపై ఎంత మంది పిల్లలు ఉన్నా.. పోటీ చేయొచ్చు.
దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేయనున్నారు. దీనిని మంత్రి వర్గం తీర్మానించింది. అదేసమయంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం ప్రతిపాదించింది. మెట్రో రెండో దశను మరింత విస్తరించడంతోపాటు.. వేగంగా పనులు పూర్తవుతుందా చూడాలని తీర్మానం చేసింది. సంక్షేమ పథకాలపై డిసెంబర్ 31 నుంచి చేపట్టనున్న ప్రచార కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూసే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని ఈ సందర్భంలో కేబినెట్‌లో చర్చించారు.
This post was last modified on October 23, 2025 8:50 pm
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…