Political News

ఏపీపై పొరుగు రాష్ట్రాల్లో జెల‌సీ.. ఏం జ‌రుగుతోంది?

1) “మీరు ఉదాసీనంగా ఉంటున్నారు. క‌నీసం మౌలిక సదుపాయాలు కూడా క‌ల్పించ‌డం లేదు. నిలువెత్తు లోతు గుంతల్లో మేం కూరుకుపోతున్నాం.“ – క‌ర్ణాట‌క స‌ర్కారును ఉద్దేశించి ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌లు చేసిన విమ‌ర్శ‌లు.

2)  “మ‌న పెట్టుబ‌డులు పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోతున్నా.. సిద్ద‌రామ‌య్య సినిమా చూస్తున్నారు. ఇలాంటి ప్ర‌భుత్వాన్ని త‌ట్టుకోలేక పారిశ్రామిక‌, ఐటీ దిగ్గ‌జాలు వెళ్లిపోతున్నారు.“ క‌ర్ణాట‌క విప‌క్షాల మాట‌.

3) “త్వ‌ర‌లోనే బెంగ‌ళూరు ఖాళీ అవుతుంది. ఇలానే వ్య‌వ‌హ‌రించండి.. ఏదో ఒక‌రోజు బెంగ‌ళూరులో ప‌ల్లీలు అమ్ముకునే ప‌రిస్థితి వ‌స్తుంది“ నెటిజ‌న్ల టాక్‌.

4)  “సీఎం స్టాలిన్.. నిద్ర పోతున్నారు. ప‌క్క‌నే ఉన్న ఏపీ అనేక పెట్టుబ‌డులు తెస్తోంది. మ‌న ద‌గ్గ‌ర ఏమున్నాయి.“ త‌మిళ‌నాడులో క‌ల్లోలం.

5)  “గూగుల్ ఏఐని చెన్నైకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాల‌ని ముందు నుంచి చెప్పాం. అయినా.. ఒక్కరూ మా మాట వినిపించుకోలేదు“ త‌మిళ‌నాడు బీజేపీ నేత‌ల స‌న్నాయి నొక్కులు.

క‌ట్ చేస్తే.. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన 16 మాసాల్లో అనేక పెట్టుబడులు తెచ్చినా.. తాజాగా తెచ్చి న గూగుల్ పెట్టుబ‌డి చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల‌ను కుదిపేస్తోంది. ఏపీని చూసి జెల‌సీతో వేడెక్కేలా చేస్తోంది. వాస్త‌వానికి ఆదిలో ఇంత హైప్ రాలేదు. “ఆ.. ఏముంది.. పెట్టుబ‌డుల్లో ఇదొక పెట్టుబ‌డి!“ అని స‌రిపుచ్చుకున్నారు.  పెద్ద‌గా ఒరిగేది కూడా ఏమీ లేద‌ని అన్నారు.

కానీ.. ఎప్పుడైతే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలు స‌భ‌లో గూగుల్ ఏఐ పెట్టుబ‌డి గురించి ప్ర‌స్తావించారో అప్ప‌టి నుంచి దీనిపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఇక‌, అంత‌ర్జాతీయ స్థాయి ప‌త్రిక‌లు కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్ర‌చురించ‌డం కూడా క‌లిసివ‌చ్చింది. ఈ ప‌రిణామాల‌తో పొరుగు రాష్ట్రాలైన క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల‌లో పెద్ద ఎత్తున విప‌క్షాలు.. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి.

This post was last modified on October 18, 2025 8:25 pm

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

6 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago