కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సమయంలో బిజెపి ఫైర్ బ్రాండ్ నాయకుడు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదు.. ఆయన మాట వినిపించకపోవడం బిజెపి వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ రాజకీయాలపై బలమైన ముద్ర వేసిన బండి సంజయ్ కీలకమైన బిజెపి నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్రంలో మంత్రి పదవిని కూడా సాధించారు. ఇప్పుడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్రలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. కేంద్రం తీసుకు వచ్చిన పథకాలను వివరిస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఆయన ప్రజలకు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో బండి సంజయ్ వంటి నాయకుడు కనిపించకపోవడం, ఆయన మాట ఎక్కడ వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. గత కొన్నాళ్లుగా బండి సంజయ్ రాష్ట్రంలో లేరని తెలుస్తోంది. ఆయన విదేశాలకు వెళ్లారా… లేకపోతే ఢిల్లీలో ఉన్నారా.. అనేది కూడా పార్టీ నాయకులు బయటకు చెప్పడం లేదు.
అయితే అంతర్గతంగా మాత్రం బండి సంజయ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నది నాయకులు చెబుతున్న మాట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీలు దూకుడుగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో బిజెపి అభ్యర్థి విజయం కోసం బండి సంజయ్ రంగంలోకి దిగుతారా దిగరా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరో 20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసిపోనుంది. వచ్చే నెల 9న ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ సందర్భంలో బలమైన గళం వినిపించే బండి సంజయ్ లేకపోతే పార్టీకి ఇబ్బంది వస్తుందన్నది కొందరు చెబుతున్న మాట.
అయితే ఆయన వస్తారని ప్రచారం చేస్తారని కొందరు అంతర్గతంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా బండి సంజయ్ లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మాస్ నాయకుడిగా గుర్తింపు పొందడం, అన్ని వర్గాల్లోనూ ఆయనకు పరిచయస్తులు ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ రంగంలోకి దిగాలన్న వాదన బిజెపి వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఆయన ఎప్పుడు వస్తారు? ఏం చేస్తారు? అనేది చూడాలి.
ఏది ఏమైనప్పటికీ బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది అని చెప్పాలి. కేంద్రం ఎంతో చేస్తోందని రాష్ట్రంలో సరైన పరిపాలన జరగడంలేదని చెబుతున్న బిజెపి ఈ ఉపఎన్నికను కీలకంగా తీసుకున్న క్రమంలో గెలుపు గుర్రం ఎక్కాలంటే బలమైన నాయకుల ప్రచారం చాలా ముఖ్యం. అలాంటప్పుడు బండి సంజయ్ ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది చూడాలి.
This post was last modified on October 17, 2025 4:01 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…