దేశంలో జమిలి ఎన్నికలు అనే వాదన.. ప్రధానిగా నరేంద్ర మోడీ.. హయాంలో రెండో సారి వినిపిస్తున్న మాట. గతంలో 2015లో కూడా ఇలానే భారీ ఎత్తున జమిలి ఎన్నికలపై ఊదరగొట్టారు. ఇంకేముంది.. జమిలి వస్తుందని.. దేశం అంతటా ఒకే సారి ఎన్నికలు జరగడం.. ఒకేసారి రాష్ట్రాల్లోను, కేంద్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడడం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన లాభాలు, నష్టాల పేరుతో మీడియా పెద్ద ఎత్తున కథనాలను కూడా ప్రచురించడం డిబేట్లు పెట్టడం తెలిసిందే. దీని వెనుక.. నరేంద్ర మోడీ బీజేపీ వ్యూహం భారీ ఎత్తున ఉందనే ప్రచారం ఉంది.
అయితే.. ఏమైందో ఏమో.. ఆ ప్రతిపాదన అప్పట్లోనే వీగిపోయింది. ఇక, మళ్లీ ఇప్పుడు తాజాగా అన్యాపదే శంగా ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి మరోసారి .. జమిలి మాట వచ్చింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ… ‘‘జమిలి ఎన్నికలపై చర్చ అనవసరం. దేశానికి అవి అత్యంత ఆవశ్యకం. కొన్ని నెలల వ్యత్యాసాల్లోనే దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్న విషయం ప్రజానీకానికి అర్థమవుతూనే ఉంది. ఈ సమస్యను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ఎన్నికల అధికారులు తగిన మార్గదర్శనం చేయాల్సిన ఆవశ్యకం ఉంది’’ అని మోడీ చెప్పుకొచ్చారు.
దీనికి సంబంధించి 2015-16 మధ్యలో ఏం జరిగిందో చూద్దాం.. అప్పటి ఎన్నికల కమిషనర్ జమిలిపై స్పష్టత ఇచ్చారు. ఇది పార్లమెంటు తేల్చాల్సిన అంశమని అన్నారు. అంతేకాదు.. ఇంత పెద్ద దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనేది అసాధ్యమని.. సిబ్బంది, భద్రత, అనేవి సాధ్యం కానేకాదని తేల్చిపారేశారు.కానీ, ఇప్పుడు మరోసారి ఈ బంతిని మోడీ.. ఎన్నికల అధికారుల కోర్టులోకి నెట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే.. జమిలి అనే మాట ఎప్పుడూ ఎందుకు తెరమీదకి వస్తుంది? అనేది కీలక విషయం. జమిలి సాధ్యం కాదనే విషయం మోడీకి తెలియదా? దీనికి సంబంధించి ప్రాంతీయ పార్టీలు అనుమతించాలనే కీలక విషయం ఆయనకు అవగాహన లేదా? అంటే.. ఖచ్చితంగా ఉంది.
అయినా.. జమిలి ఓ రాజకీయ పాచిక. తమకు ఇబ్బందికర రాష్ట్రాల్లో.. తమకు బలం లేని రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం జమిలి! నిజానికి జమిలిపై అంత ప్రేమ ఉన్న ప్రధాని.. నెల రోజులు కూడా నిండని బిహార్ ఎన్నికలను ఎందుకు నిర్వహించినట్టు? అనేదానికి సమాధానం లేదు. పైగా.. ములాయం సింగ్ సహా.. అనేక మంది మాజీ ముఖ్యమంత్రులు.. జమిలికి వ్యతిరేకం. అయినా కూడా వ్యూహాత్మక రాజకీయ విన్యాసంలో మోడీ మరోసారి జమిలిని తెరమీదకి తెచ్చి.. కొంత చర్చకు అవకాశం కల్పించారు. అంతే.. తప్ప.. ఇది జరిగేదీ కాదు.. జరగబోయేదీ కాదు!! జమిలి ఓ బ్రహ్మ పదార్థం అంతే!!
This post was last modified on November 27, 2020 8:18 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…