ఔను.. సీఎం చంద్రబాబు పాలన అంటే.. పారదర్శకతకు పెద్దపీట వేస్తారన్న పేరుంది. బయట ఎలా మాట్లాడినా.. అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా లెక్కలు చూపుతారని అంటారు. అదేసమయంలో సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారన్న పేరు కూడా ఉంది. కానీ, ఇప్పుడు అదే అసెంబ్లీలో సభ్యులు దారి తప్పుతున్నారు. కేవలం సభ్యులే కాదు.. మంత్రులు కూడా.. తప్పుడు దారిలో నడుస్తున్నారని స్వయంగా చంద్రబాబు హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఇది ఆయన పాలనకు పెద్ద మైనస్‌గా మారిపోయింది.
ఎవరికి వారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జగన్ హయాంలో జరిగిన అప్పులను ప్రస్తావిస్తూ.. ఇంకా అబద్ధాలు చెబుతున్నారన్నది ప్రధాన విమర్శ. ఈ విషయాన్ని అధికార పార్టీ సభ్యులే గుసగుస లాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సభల్లోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. జగన్ హయాంలో 3 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. కానీ, మర్నాడే.. శాసన మండలిలో మరో మంత్రి టీజీ భరత్, అచ్చెన్నాయుడు.. వైసీపీ హయాంలో 9 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పారు.
ఇక, వైసీపీ హయాంలో రహదారులు నిర్మించలేదని ఆది నుంచి చెబుతున్న ప్రభుత్వం.. ఇటీవల అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 32 శాతం మేరకు వైసీపీ హయాంలో రోడ్లు వేశారని టీడీపీ సబ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇక, కేంద్రం ఇచ్చిన 17 మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని పీపీపీకి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో అసలు కాలేజీలను నిర్మించలేదని అందుకే పీపీపీకి ఇస్తున్నట్టు తెలిపింది. వాస్తవం వచ్చే సరికి మరుసటిరోజు మంత్రి సత్యకుమార్ మండలిలో మాట్లాడుతూ.. 5 కాలేజీలు పూర్తయ్యాయని వివరిం చారు.
ఇలా పొంతనలేని విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా సర్కారుపై తొలిసారి సభలో కూడా నిజాలు చెప్పడం లేదన్న వాదన బలంగా వినిపించే పరిస్థితి వచ్చింది. ఇది మంచిది కాదన్న విషయం చంద్రబాబు కూడా గ్రహించారు. అందుకే.. సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సభా ముఖంగానే శుక్రవారం హెచ్చరించారు. నిజానికి గతంలో ఇంత తీవ్ర స్థాయిలో సభలో వ్యవహారాలు వివాదాల చుట్టూ తిరగలేదు. కానీ, తొలిసారి ఇప్పుడు ఇలా జరుగుతున్న తీరు.. చంద్రబాబు ఇమేజ్‌కే దెబ్బ పడేలా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on September 28, 2025 8:55 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…