మే 3 తర్వాత అయినా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో ఊరటిస్తుందేమో అని ఆశగా చూసిన జనాలకు నిరాశ తప్పలేదు. ఇంకో రెండు వారాలు లాక్ డౌన్‌ను కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈసారి లాక్ డౌన్ అమలులో షరతులు ఎలా ఉంటాయో.. మినహాయింపులేమైనా ఉంటాయేమో ప్రధాని ప్రసంగం చూస్తే స్పష్టత రావచ్చు. కరోనా కంటే లాక్ డౌన్ వల్ల ఎక్కువమంది మరణిస్తారని.. ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందని.. భవిష్యత్తు భయానకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇక లాక్ డౌన్ అంటూ ఏమీ ప్రకటించదని.. రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేస్తుందని.. మినహాయింపులు ఉంటాయని అనుకున్నారు.
కానీ అలాంటిదేమీ లేదని.. దేశవ్యాప్తంగా ఇంకో రెండు వారాలు లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఐతే కేంద్రం లాక్ డౌన్ విషయంలో ఇంత కఠినంగా ఉండటానికి కారణం.. రంజాన్ మాసం మొదలు కావడమే అంటున్నారు నిపుణులు. మస్లింలు ఈ మాసాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో.. మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేయడాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తేస్తే దేశవ్యాప్తంగా మసీదులు జనాలతో పోటెత్తుతాయి.
ఈపాటికి దేశంలో ఎప్పుడో అదుపులోకి రావాల్సిన కరోనా మార్చి రెండో వారంలో జరిగిన ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల వల్లే విశృంఖల స్థాయికి చేరుకుందన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేసినట్లు ఇప్పుడు ప్రకటిస్తే కోట్ల మంది మసీదులకు వెళ్లి గుంపులు గుంపులుగా ప్రార్థనలు చేస్తారు. దీని వల్ల కరోనా వ్యాప్తి విపరీత స్థాయిలో ఉంటుందన్న అంచనాతో లాక్ డౌన్ తప్పక అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే శనివారం ఉదయం తన ప్రసంగంలో భాగంగా మోడీ ఈ రెండు వారాల్లో ఏమేం మినహాయింపులుంటాయో వివరించే అవకాశముంది.
This post was last modified on May 2, 2020 2:43 am
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…