Political News

చిరంజీవి రియాక్ష‌న్‌.. వైసీపీకి మేలా?

ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లపై గురువారం రాత్రి.. మెగా స్టార్ చిరంజీవి స్పందించా రు. సుమారు 10 కీల‌క పాయింట్ల‌ను ఆయ‌న లేవ‌నెత్తారు. అయితే.. పాయింట్లు వైసీపీకి మేలు చేసేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపించ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ హ‌యాంలో సినిమా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేందుకు.. 2023లో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరోలు ప్ర‌భాస్‌, మ‌హేష్‌బాబు స‌హా ప‌లువురితో క‌లిసి చిరంజీవి తాడేప‌ల్లి నివాసానికి వ‌చ్చారు.ఈ స‌మ‌యంలో మంత్రి పేర్ని నానితోనే భేటీ కావాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పార‌న్న వార్త వెలుగు చూసింది.

అయితే.. త‌మ స‌మ‌స్య‌ల‌పై మంత్రి పేర్నితో పాటు సీఎం జ‌గ‌న్‌తోనూ చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని చిరు చెప్ప‌డంతో సీఎం జ‌గ‌న్ వారికి ఆల‌స్యంగా అప్పాయింట్ మెంటు ఇచ్చార‌న్న‌ది అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ఈ వ్య‌వ‌హారం తాజాగా అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య‌.. చిరుపై వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. గురువారం రాత్రి చిరు స్పందించారు. తాను ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నాన‌ని, ఎమ్మెల్యే బాల‌కృష్ణ వ్యాఖ్య‌లు టీవీలో చూశాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే.. సీఎం జ‌గ‌న్ త‌మ‌కు అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌లేద‌ని చెప్ప‌డం స‌రికాద‌న్నారు.

తాము తాడేప‌ల్లికి వెళ్ల‌గానే ప్రొటోకాల్ ప్ర‌కారం అధికారులు వ్య‌వ‌హ‌రించార‌ని చిరు తెలిపారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్‌తో క‌లిసి తాము భోజ‌నం చేశామ‌ని.. ఈ స‌మ‌యంలో ఆయ‌న అన్ని స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్నార‌ని, ప్ర‌తి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని చిరు వెల్ల‌డించారు. అంతేకాదు.. నాడు బాల‌య్య సినిమా వీర‌సింహారెడ్డికి, త‌న సినిమా వాల్తేరు వీర‌య్య‌కు కూడా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని.. సీఎం జ‌గ‌న్‌.. మౌఖికంగా అప్ప‌టిక‌ప్పుడే ఆదేశాలు ఇచ్చార‌ని చిరు మ‌రో బాంబు పేల్చారు. తాను జోక్యం చేసుకుని చ‌ర్చించ‌క‌పోతే.. నాటి వీర‌సింహారెడ్డి క‌ష్టాలు తొల‌గేవి కాద‌ని తేల్చి చెప్పారు.

ఇక‌, జ‌గ‌న్ ఎవ‌రి ఒత్తిడితోనో క‌ల‌వ‌లేద‌న్న చిరంజీవి.. ఆయ‌నే స్వ‌యంగా వ‌న్ టు వ‌న్ క‌లుసుకునేందుకు ఆహ్వా నించార‌ని, ఆయ‌న‌తో క‌లిసి లంచ్ కూడా చేశామ‌ని వివ‌రించారు. క‌రోనా టైం కావ‌డంతో ఐదుగురిని మాత్ర‌మే రావా ల‌ని జ‌గ‌న్ చెప్పార‌ని.. కానీ, తాను 10 మంది వ‌స్తామ‌ని చెప్ప‌డంతో స‌రే న‌ని ర‌మ్మ‌న్నార‌ని వ్యాఖ్యానించారు. అప్పుడు ప‌దిమందితో క‌లిసి వెళ్లాన‌న్నారు. “అసెంబ్లీలో నా పేరు ఎత్తారు కాబ‌ట్టి.. నేను స్పందించాల్సి వ‌చ్చింది.” అని చిరు ముక్తాయించారు. అయితే.. చిరు వ్యాఖ్య‌లు.. వైసీపీకి మ‌ద్ద‌తుగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా చిన్న విష‌యం.. గ‌తించిన విష‌యం.. ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం రేప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 26, 2025 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

27 minutes ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

1 hour ago

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…

2 hours ago

లడ్డూ అంశంపై అసెంబ్లీలో పవన్ చర్చ?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…

2 hours ago

జక్కన్నా… నువు అసాధ్యుడివయ్యా!

ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్‌డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్‌డేట్‌…

2 hours ago

‘బుడగ పేలుతుంది… బంగారం కొనొద్దు’

సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…

3 hours ago