ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై గురువారం రాత్రి.. మెగా స్టార్ చిరంజీవి స్పందించా రు. సుమారు 10 కీలక పాయింట్లను ఆయన లేవనెత్తారు. అయితే.. పాయింట్లు వైసీపీకి మేలు చేసేలా ఉన్నాయన్న వాదన వినిపించడం గమనార్హం. వైసీపీ హయాంలో సినిమా సమస్యలపై మాట్లాడేందుకు.. 2023లో దిగ్గజ దర్శకుడు రాజమౌళి, హీరోలు ప్రభాస్, మహేష్‌బాబు సహా పలువురితో కలిసి చిరంజీవి తాడేపల్లి నివాసానికి వచ్చారు.ఈ సమయంలో మంత్రి పేర్ని నానితోనే భేటీ కావాలని జగన్ తేల్చి చెప్పారన్న వార్త వెలుగు చూసింది.
అయితే.. తమ సమస్యలపై మంత్రి పేర్నితో పాటు సీఎం జగన్‌తోనూ చర్చించాలని నిర్ణయించుకున్నామని చిరు చెప్పడంతో సీఎం జగన్ వారికి ఆలస్యంగా అప్పాయింట్ మెంటు ఇచ్చారన్నది అప్పట్లో సంచలనం రేపింది. ఈ వ్యవహారం తాజాగా అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు బాలయ్య.. చిరుపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. గురువారం రాత్రి చిరు స్పందించారు. తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నానని, ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలు టీవీలో చూశానని ఆయన పేర్కొన్నారు. అయితే.. సీఎం జగన్ తమకు అప్పాయింట్‌మెంటు ఇవ్వలేదని చెప్పడం సరికాదన్నారు.
తాము తాడేపల్లికి వెళ్లగానే ప్రొటోకాల్ ప్రకారం అధికారులు వ్యవహరించారని చిరు తెలిపారు. అనంతరం సీఎం జగన్‌తో కలిసి తాము భోజనం చేశామని.. ఈ సమయంలో ఆయన అన్ని సమస్యలను సావధానంగా విన్నారని, ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని చిరు వెల్లడించారు. అంతేకాదు.. నాడు బాలయ్య సినిమా వీరసింహారెడ్డికి, తన సినిమా వాల్తేరు వీరయ్యకు కూడా అప్పటి వరకు ఉన్న ఇబ్బందులను తొలగించాలని.. సీఎం జగన్.. మౌఖికంగా అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చారని చిరు మరో బాంబు పేల్చారు. తాను జోక్యం చేసుకుని చర్చించకపోతే.. నాటి వీరసింహారెడ్డి కష్టాలు తొలగేవి కాదని తేల్చి చెప్పారు.
ఇక, జగన్ ఎవరి ఒత్తిడితోనో కలవలేదన్న చిరంజీవి.. ఆయనే స్వయంగా వన్ టు వన్ కలుసుకునేందుకు ఆహ్వా నించారని, ఆయనతో కలిసి లంచ్ కూడా చేశామని వివరించారు. కరోనా టైం కావడంతో ఐదుగురిని మాత్రమే రావా లని జగన్ చెప్పారని.. కానీ, తాను 10 మంది వస్తామని చెప్పడంతో సరే నని రమ్మన్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు పదిమందితో కలిసి వెళ్లానన్నారు. “అసెంబ్లీలో నా పేరు ఎత్తారు కాబట్టి.. నేను స్పందించాల్సి వచ్చింది.” అని చిరు ముక్తాయించారు. అయితే.. చిరు వ్యాఖ్యలు.. వైసీపీకి మద్దతుగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఏదేమైనా చిన్న విషయం.. గతించిన విషయం.. ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates