ఉప్పాడ… ఈ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది చీరలు(ఉప్పాడ చీరలు). అదేసమయంలో సముద్ర ఉత్పత్తులు కూడా. ఏపీలోని కాకినాడ తీర గ్రామమైన ఈ ఉప్పాడ తాజాగా.. వార్తల్లోకి ఎక్కింది. పెద్ద ఎత్తున ఇక్కడి మత్స్యకారులు ఉద్యమానికి దిగారు. రహదారులు దిగ్భందించారు. ఒకరోజు కాదు..రెండు రోజులు కాదు.. గత నాలుగు రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉద్యమిస్తున్న మత్స్యకార కుటుంబాలు బుధవారం తమ ఆందోళనను జాతీయ రహదారిపైకి ఎక్కించాయి. అంతేకాదు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చి.. తమకు హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించేది లేదని తేల్చి చెప్పారు.
ఏం జరిగింది?
ఉప్పాడలో దాదాపు వెయ్యికిపైగా మత్స్యకార కుటుంబాలు.. సముద్రంలో వేటపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే.. సమీపంలో పరిశ్రమలు.. తమ వ్యర్థాలను సముద్రంలోకి వదిలేస్తుండడంతో కాలుష్యం ఏర్పడి.. తమ జీవనానికి పెను శాపంగా మారిందని.. ఇక్కడి మత్స్యకారులు గత ఐదేళ్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక సారిఉప్పాడలో పర్యటించారు. మత్స్యకారులను ఆదుకుంటామని.. వారికి ప్రాణ సంకటంగా మారిన ఈ కాలుష్య సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. “మేం అధికారంలోకి రాగానే.. మీ సమస్య పరిష్కరిస్తాం.” అని తేల్చి చెప్పారు.
అయితే.. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినా.. తమ సమస్యలు పరిష్కారం కాలేదంటూ.. ఇక్కడి మత్స్యకారులు తరచుగా ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా తమ ఆంందోళనను మరింత తీవ్రతరం చేశారు. బుధవారం ఏకంగా.. జాతీయ రహదారిని కూడా దిగ్భందించి ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు.. పవన్ కల్యాణ్ తమ వద్దకు వచ్చి.. ఇచ్చిన హామీని నెరవేర్చాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. కలెక్టర్ షణ్ మోహన్‌ను మత్స్యకారుల వద్దకు పంపించారు. వారి డిమాండ్లను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ సమస్యపై కమిటీ వేస్తున్నట్టు పవన్ ప్రకటించారు. అసెంబ్లీలోనూ చర్చిస్తామని హామీ ఇచ్చారు. కానీ.. మత్స్యకారులు మాత్రం శాంతించలేదు. పవన్ వచ్చే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని తే్ల్చి చెప్పారు.
సమస్యలు చాలా..
కొసమెరుపు: ఉప్పాడలో మెజారిటీ పరిశ్రమలు.. కీలక రాజకీయ పార్టీకి చెందిన నాయకుల చేతిలో ఉన్నాయి. పైగా.. వారు బలమైన నాయకులు కావడంతో సర్కారుకు ఇబ్బందులు తప్పడం లేదు.
This post was last modified on September 24, 2025 10:58 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…