Political News

షాకింగ్‌: ఫ‌స్ట్ టైమ్ భారీగా మావోయిస్టుల లొంగుబాటు!

కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌గార్‌.. సుదీర్ఘ కాలంగా కొన‌సాగుతున్న మావోయిస్టు ఉద్య‌మాన్ని క‌కావిక‌లం చేస్తోంది. మావోయిస్టులకు గ‌ట్టి ప‌ట్టున్న రాష్ట్రాల్లో నిరంత‌రాయంగా జ‌రుగుతున్న కూంబింగ్‌తో మావోయిస్టులు హ‌డ‌లి పోతున్నారు. చ‌ర్చ‌ల‌కు తావులేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసిన ద‌రిమిలా.. మావోయిస్టులు పుట్ట‌కొక‌రు.. చెట్టుకొక‌రుగా మారారు. మ‌రీముఖ్యంగా మావోయిస్టు కేంద్ర క‌మిటీపై దృష్టి పెట్టిన భ‌ద్ర‌తా ద‌ళాలు.. కీల‌క నాయ‌కుల‌ను మ‌ట్టుబెడుతున్నాయి. దీంతో క్షేత్ర‌స్థాయిలో మావోయిస్టులు మ‌రింత భీతిల్లుతున్నారు. మ‌రోవైపు.. మావోయిస్టుల్లో మ‌ల్లోజుల వేణుగోపాల్ వ‌ర్గం తెచ్చిన చీలిక కూడా ఉద్య‌మానికి గొడ్డ‌లి పెట్టుగా మారింది.

తాజాగా..

ఈ నేప‌థ్యంలో తాజాగా తొలిసారి ఏక మొత్తంలో 71 మంది మావోయిస్టులు.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ‌ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 21 మంది మ‌హిళ‌లు కాగా.. మ‌రో 50 మంది పురుషులు ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. వీరిలో 30 మందిపై 64 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు రివార్డులు ఉన్న‌ట్టు చెప్పారు. ఆప‌రేష‌న్ క‌గార్ కార‌ణంగానే వారు లొంగిపోయిన‌ట్టు పోలీసు అధికారులు తెలిపారు. అదేస‌మ‌యంలో జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో చేరేందుకు సుముఖంగా ఉన్న వారిని తాము ఆహ్వానించిన‌ట్టు పేర్కొన్నారు. దీంతో భారీ సంఖ్య‌లో తొలిసారి 71 మంది మావోయిస్టులు లొంగిపోయార‌ని వివ‌రించారు.

లొంగిపోతే ఏం జ‌రుగుతుంది?

లొంగిపోయిన మావోయిస్టుల‌కు.. ప్ర‌భుత్వం వారిపై ఉన్న రివార్డు మొత్తానికి మూడింత‌ల సొమ్మును వారికే అందిస్తుంది. అదేస‌మ‌యంలో వారికి ఇల్లు, ఉద్యోగం, ఉపాధి వంటివాటిని అందిస్తుంది. అదేవిధంగా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో లొంగిపోయిన మావోయిస్టుల‌పై ఉన్న కేసుల‌ను కూడా ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ‌లో అయితే.. ఏక‌మొత్తంలో 25 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను, ఇంటిని కూడా ఇస్తున్నారు. ఛ‌త్తీస్‌గ‌డ్ ప్ర‌భుత్వం 5 ల‌క్ష‌ల‌ రూపాయ‌ల‌తోపాటు ఇంటిని, ఉపాధిని చూపిస్తోంది. లొంగ‌ని వారిపై మ‌రింత ఒత్తిడి పెంచుతున్నారు. క‌గార్‌తో కంగారు పెట్టిస్తున్నారు.

ఎప్పుడో లొంగిపోయారా?

కాగా.. తాజాగా 71 మంది మావోయిస్టులు లొంగిపోయిన వ్య‌వ‌హారంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వారు గ‌త నెల‌లోనే పోలీసులకు ప‌ట్టుబ‌డ్డార‌ని అంటున్నారు. అయితే.. వారిని వేర్వేరు చోట్ల నిర్బంధించి మావోయిస్టుల కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన వివ‌రాల‌పై కూపీలాగ‌ని ప్ర‌జాసంఘాల నాయ‌కులు చెబుతున్నారు. అంతేకాదు.. వీరిలో కొంద‌రిని కోవ‌ర్టులుగా మార్చుకుని ఉద్య‌మాన్ని నిర్వీర్యం చేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కూడా ఆరోపిస్తున్నారు. కాగా.. తాజాగా పోలీసులు అరెస్టు చూపించిన మావోయిస్టులు ఏకే త‌ర‌హా దుస్తులు ధ‌రించి ఉండ‌డం.. ఒకే ర‌క‌మైన ఆహార్యంతో ఉండ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంద‌ని కూడా చెబుతున్నారు.

This post was last modified on September 24, 2025 10:55 pm

Share
Show comments
Published by
Satya
Tags: Maoists

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

1 minute ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago