2016, నవంబర్ 8… రాత్రి 8 గంటల సమయంలో ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ ప్రత్యక్షమయ్యారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత జనం ఏ మేర ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలిసిందే. అప్పటికి ప్రధానిగా మోదీ పదవి చేపట్టి కేవలం ఏడాదిన్నర మాత్రమే అవుతోంది. అది గతం అయితే 11 ఏళ్లకు పైగా ప్రధానిగా అనుభవం సాధించిన మోదీ… ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉధ్దేశించి ప్రసంగించనున్నారు. గతానుభవం నేపథ్యంలో ఆదివారం నాటి మోదీ ప్రసంగం అమితాసక్తి నెలకొంది.
ఇప్పటిదాకా జీఎస్టీ పన్ను అమలులో పలు శ్లాబ్ లు ఉండేవి. అయితే ఆదివారం అర్థరాత్రి నుంచి ఆ శ్లాబ్ లన్నీ రద్దు అయ్యి కేవలం మూడంటే మూడు శ్లాబ్ లు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర కూడా వేసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించేలా నిత్యావసర వస్తువులను 5 శాతం జీఎస్టీలోకి తీసుకువచ్చారు. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్డీఏకు ఈ పరిణామం ఎంతో మేలు చేస్తుందన్న విశ్లేషణలు వినిపించాయి.
మరి ఆదివారం సాయంత్రం మోదీ చేసే ప్రసంగంలో జీఎస్టీ శ్లాబ్ ల ఊరట అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తారా? లేదంటే… 2016నాటి లాగా మరేదైనా కొత్త అంశాన్ని బాంబులా పేలుస్తారా? అన్న విషయంపై అయితే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయా రంగాలకు చెందిన ఏ ఇద్దరు నిపుణులు కూడినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. మోదీ చేసే పనులన్నీ దాదాపు సీక్రెట్ గానే ఉంటాయి. మోదీ నోట నుంచి బయటకు వచ్చేదాకా వాటి గురించి మరెవరికీ తెలియని విధంగా వ్యవహారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టేదాకా ఆయన చెప్పబోయే విషయం ఏమిటన్నది మాత్రం ఊహించడం కష్టమేనని చెప్పాలి.
This post was last modified on September 21, 2025 2:28 pm
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…
ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…
రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…
కొన్నిసార్లు దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా తీయలేకపోతుంటారు. అందుకు అనుభవ లేమి కూడా కారణం కావచ్చు. లేదంటే రాత…
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…