సెలవు దినం ఆదివారం సోషల్ మీడియాలోకి ఓ అత్యంత ఆసక్తికరమైన ఫొటో ఒకటి వచ్చి చేరింది. క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోతోంది. అయినా ఆ ఫొటోలో ఏముందంటే… పెద్దగా ఏమీ లేదు గానీ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తన వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ మోదీపై అవాకులు, చెవాకులు పేల్చే బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, మోదీతో కలిసి ఫొటో దిగారట. ఆ ఫొటోను ఆయనే తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ పోస్టు తెగ వైరల్ అయిపోతోంది,.
ఈ ఫొటోకు ప్రకాశ్ రాజ్ క్యాప్షన్ కూడా పెట్టారు. “ఆయనను ఎయిర్ పోర్టులో కలిశాను. అయితే మా మధ్య మాటలేమీ పెగల్లేదు” అంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు. పోనీ ఏ ఎయిర్ పోర్టు అన్నవిషయాన్ని కూడా ఆయన వెల్లడించలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి బీజేపీతో వైరంతో సాగిన ప్రకాశ్ రాజ్ ఎన్నికల్లో ఏకంగా బెంగళూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు. అప్పటి నుంచి ‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను సోషల్ మీడియా వేదికగా నిరసిస్తూ వస్తున్నారు. తాజాగా ఆదివారం నాటి మోదీతో తాను దిగిన ఫొటోకు యాడ్ చేసిన క్యాప్షన్ లోనూ ప్రకాశ్ రాజ్ ‘జస్ట్ ఆస్కింగ్’ అన్నహ్యాష్ ట్యాగ్ ను తగిలించేశారు.
ఈ ఫొటోను చూసిన వారిలో చాలా మంది అది నిజమైన ఫొటోనేనని నమ్మారు. మోదీని తిడుతూ ఆయనతో ఫొటో ఎలా దిగారంటూ ప్రకాశ్ రాజ్ పై విమర్శలు సంధించారు. అయితే అసలు విషయానికి వస్తే… మోదీతో ప్రకాశ్ రాజ్ ఫొటోనే దిగలేదు. ఏదో ఎయిర్ పోర్టులో తాను వెళుతున్న మార్గానికి అత్యంత సమీపంలో మోదీకి చెందిన నిలువెత్తు కటౌట్ కనిపిస్తే… దాని పక్కన్నే నిలబడ్డ ప్రకాశ్ రాజ్… మోదీతో ఫొటో దిగినట్లు కలరింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
This post was last modified on September 21, 2025 2:14 pm
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…