Political News

మిథున్‌రెడ్డిని కొట్టకండి: కోర్టు ఆదేశం

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసుల క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ.. విజ‌య‌వాడ లోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయ‌న‌ను రెండు రోజుల పాటు విచారించేందుకుఅనుమ‌తి ఇచ్చింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి డిస్ట‌రీల నుంచి సొమ్ములు వ‌సూలు చేయ‌డంలోనూ.. టార్గెట్లు నిర్ణ‌యించ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషించిన‌ట్టు ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు చెబుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే కేసులో మిథున్ రెడ్డిని ఏ4గా పేర్కొన్నారు. ఇక‌, ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డిని మ‌రింత‌లోతుగా విచారించాల‌ని కోరుతూ.. సిట్ అధికారులు గ‌తంలోనే ఏసీబీ కోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై ప‌లు ద‌ఫాలుగా విచార‌ణ కూడా సాగింది. తాజాగా ఆయ‌న‌ను రెండు రోజుల పాటు క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ.. కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌కు పలు ష‌ర‌తులు విధించింది.

ఇవీ ష‌ర‌తులు..

1) ఉద‌యం 8 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే విచారించాలి.
2) విచార‌ణ స‌మ‌యంలో కొట్ట‌డం.. తిట్ట‌డం.. వంటివి చేయ‌రాదు.(గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి)
3) మాన‌సిక వేధింపుల‌కు గురి చేయొద్దు.
4) విచార‌ణ స‌మ‌యంలో ఆయ‌న‌కు విరామం ఇవ్వండి.
5) రెండు పూట‌లా ఆయ‌న కోరుకున్న ఆహారం ఇవ్వాలి.
6) విచార‌ణ స‌మ‌యంలో మిథున్ రెడ్డి న్యాయ‌వాదిని అనుమ‌తించాలి.
7) విచార‌ణ మొత్తాన్నీ ఆడియో, వీడియో రికార్డులు చేయాలి.
8) ఈ కేసు విచార‌ణ‌లో సంబంధం లేని వ్య‌క్తులు విచార‌ణ‌లో జోక్యం చేసుకోరాదు.
9) సిట్ నియ‌మించిన అధికారులు మాత్ర‌మే మిథున్ రెడ్డిని విచారించాలి.

సిట్ రాబ‌ట్టే అంశాలు ఏంటి?

1) మ‌ద్యం కేసులో ముడుపులు వ‌సూలు చేయాల‌ని ఎవ‌రు చెప్పారు?
2) ఏడిస్టిల‌రీకి ఎంత టార్గెట్ విధించారు.
3) దుబాయ్ త‌దిత‌ర దేశాల్లో ఎందుకు సిట్టింగులు వేశారు?
4) ఇతర నిందితులతో ఉన్న సంబంధాలు ఏంటి?
5) గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు ఈ నిధులు పంపిణీ చేశారా?
6) అంతిమంగా ఈ కేసులో ల‌బ్ధి పొందింది ఎవ‌రు?

This post was last modified on September 18, 2025 9:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

2 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago