ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. వర్షాకాల సమావేశాల్లో కీలకమైన నాలుగు బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో సభకు అందరూ రావాలని పదేపదే స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా అధికారులు కూడా ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. వైసిపి ఎలాగూ రావడం లేదు. కాబట్టి ఆ పార్టీ నాయకులను ఆ పార్టీ అధినేతను కూడా పదేపదే చంద్రబాబునాయుడు పిలిచారు. అది సవాల్ రూపంలో కావచ్చు రాజకీయ రూపంలో కావచ్చు.
ఏదేమైనా సభకు రావాలని చర్చలలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఇక స్పీకర్ కూడా సభకు రాకపోవడం సరికాదన్నది ఆది నుంచి చెబుతున్న మాట. అయినప్పటికీ వైసీపీ నాయకులు రాలేదు. సరే ఈ విషయం పక్కన పెడితే.. మరి సొంత పార్టీ నాయకుల మాట ఏంటి? కూటమి ఎమ్మెల్యేలే 164 మంది ఉన్నారు. అంటే సభ మొత్తం నిండిపోవాలి. కేవలం 11 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండాలి. అంతే కదా జరగాల్సింది. కానీ, చిత్రం ఏంటంటే సభలో కనీసం 40 మంది కూడా లేకపోవడం పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనంతో చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
“40 మంది కూడా లేకపోతే ఎట్లా“ అని ఆయన తొలి వాక్యంలోనే చెప్పటం విశేషం. మరి అంత బిజీగా ఉన్నారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే సభకు రావడం లేదా అనేది తేలాల్సి ఉంది. చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని, నిధులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. దీనిపై పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబుకు కూడా లేఖ రాసిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కు సైతం వారు విన్నవించారు. బహుశా ఈ కారణంతో వారు సభకు రాకుండా డుమ్మా కొట్టారా అనేది చర్చ.
లేకపోతే తొలి రోజు ఏమంటుందిలే సభలో అని భావించారా అనేది చూడాలి. ఏదేమైనా తొలి రోజే అధికార పార్టీకి చెందిన 164 మంది ఎమ్మెల్యేలలో కేవలం 40 నుంచి 42 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారని స్పీకర్ చెప్పడమే చాలా విచిత్రంగా.. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి సూచనలు చేస్తారు.. ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ఆయన సభ నాయకుడు కాబట్టి.. ఆయన తీసుకునే నిర్ణయానికి సభ్యులు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది.
This post was last modified on September 18, 2025 5:03 pm
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…