Political News

టీడీపీలో గ్రీష్మ‌.. ఏం చేస్తున్నారు చెప్మా.. !

టిడిపి అధినేత సీఎం చంద్రబాబు ఎవరికైనా పదవులు ఇచ్చినా.. ఎవరికైనా అవకాశాలు కల్పించినా.. వారి నుంచి మరింత ప్రయోజనం ఆశిస్తారు. ఇది సహజం. రాజకీయాలైనా వ్యాపారమైనా ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆదాయాన్ని కోరుకున్నట్టుగానే ఒక వ్యక్తికి ఏదైనా పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి ద్వారా ఆ పార్టీ ప్రయోజనాలు.. ఆ పార్టీకి సంబంధించిన అనుకూల అంశాలను కోరుకోవడం తప్పేమీ కాదు. ఇది ఆది నుంచి జరుగుతున్న వ్యవహారం. ఈ రకంగానే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు చంద్రబాబునాయుడు ఏరుకోరి ప‌ద‌వి అప్పగించారు.

వాస్తవానికి గ‌త‌ ఎన్నికల్లో గ్రీష్మ‌ ఎమ్మెల్యే టికెట్ ఆశించారని చర్చ జరిగింది. అయితే కొంత పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆమెకు ఎమ్మెల్సీ సీటును ఇచ్చారు. దీనికి ప్రధాన కారణం మండలిలో బలమైన వాయిస్ వినిపించేవారు ఉన్నప్పటికీ.. మరింత బలమైన వాయిస్ వినిపించేవారు కావాలి. అదేవిధంగా రఫ్ గా వ్యాఖ్యలు చేసేవారు.. రఫ్ గా దూకుడుగా వ్యవహరించే వారు కావాలని చంద్రబాబు ఆసలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కావలి గ్రీష్మను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం.

టిడిపి నిర్వహించిన ఒంగోలు మహానాడులో ఆమె తొడ కొట్టి మరి వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది చంద్రబాబు నాయుడును ఆకర్షించింది. దీంతో ఆమెకు ప్రమోషన్ చేస్తూ మండలిలో నియమించారు. ఆమె బలమైన వాయిస్ వినిపించాలని కోరుకున్నారు. సరే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇది జరిగి 5, 6 నెలలు అయిపోయినా ఇప్పటివరకు కూడా గ్రీష్మ కనీసం మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈ లోపు అనేక పరిణామాలు జరిగాయి. జగన్ యాత్రలకు సంబంధించిన వివాదాలు, రైతులకు సంబంధించిన అంశాలు తెర‌మీదికి వచ్చాయి.

యూరియాకి సంబంధించిన అంశాలు వచ్చాయి. ఉల్లిపాయలకి సంబంధించిన విషయాలు వచ్చాయి. తాజాగా వైద్య కళాశాలకు సంబంధించిన అంశాలు కూడా తెరమీద కు వచ్చాయి. ఇన్ని విషయాలు వచ్చినప్పటికీ కూడా గ్రీష్మ పార్టీ తరపున వాయిస్ వినిపించడం కానీ తనదైన శైలిలో ఎదురుదాడి చేయడం కానీ అనేది ఎక్కడ కనిపించలేదు. వినిపించలేదు. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఆవిడ కోరుకున్నది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం దీనికి సమాధానం అయితే లేదు.

కానీ, భవిష్యత్తులో ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారనేది చూడాలి? మరి కొద్ది రోజుల్లో శాసన మండలి ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రీష్మపై పార్టీ మంచి ఆశలు పెట్టుకుంది. బలమైన వైసీపీ గళాన్ని ఎదుర్కొనేందుకు గ్రీష్మ లాంటి రఫ్ గా వ్యవహరించే నాయకురాలు ఉపయోగపడతారని భావిస్తోంది. మరి ఆవిడ ఈ విషయంలో సక్సెస్ అవుతారా లేకపోతే మైనస్ అవుతారా అనేది చూడాలి.

This post was last modified on September 18, 2025 12:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

59 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago