ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం రెడీ అయింది. వచ్చే ఏడాదితో రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు గడువు తీరుతుంది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం నాలుగు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో నీలం సాహ్ని మీడియాతో మాట్లాడారు. ఈ దఫా ఎన్నికలను స్వేచ్ఛగా పక్షపాత రహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఇదేసమయంలో బ్యాలెట్ పేపర్ కాకుండా.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.
ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇదీ..
▪️ 2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
▪️ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురిస్తారు.
▪️ నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి.
▪️ నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి.
▪️ డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు. ఈ సారి స్థానికంగా 33 శాతానికి బదులు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు.
▪️ డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు.
▪️ 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారు.
వైసీపీ హయాంలో వివాదం..
వైసీపీ హయాంలో 2021లో స్థానిక సమరం జరిగింది. అయితే.. అప్పట్లో కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రారంభించి కూడా మధ్యలోనే వాయిదా వేశారు. ఈ మేరకు అప్పటి కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. అప్పటి సీఎం జగన్ దీనిని తీవ్రంగా తప్పుబట్టడంతోపాటు.. “చంద్రబాబు కమ్మ.. నిమ్మగడ్డ కూడా కమ్మే కాబట్టి.. కులాల ప్రకారం న్యాయం చేసుకునేందుకు ఎన్నికలను నిలుపుదల చేశారు” అంటూ తీవ్ర వివాదానికి దిగారు. ఇక,… అప్పటి ఎన్నికల్లో టీడీపీ, జనసేనల తరఫున ఎవరినీ నామినేషన్ వేయకుండా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారన్న వాదన కూడా ఉంది.
This post was last modified on September 9, 2025 6:44 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…